నందమూరి బాలకృష్ణ సర్జరీ చేయించుకుంటున్నారా? అవుననే అంటున్నాయి సన్నిహిత వర్గాలు. బాలయ్య కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధ పడుతున్నారు. అందుకే కొన్ని సినిమాలుగా పెద్దగా స్టెప్పులు వేయడం లేదు. ఈమధ్య పైసా వసూల్, జై సింహాలలో మాత్రం మోకాలి చిప్పలు అరిగిపోయే రేంజులో స్టెప్పులు వేశారు. జై సింహాలో.. అయితే జానీ మాస్టర్ బాలయ్యతో కొత్త తరహా స్టెప్పులు వేయించాడు. ఆ సమయంలో మోకాలి గాయం తిరగబెట్టిందని సమాచారం. ఇప్పుడు దానికి తగిన చికిత్స చేయించుకోవాలని బాలయ్య డిసైడ్ అయ్యారు. ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో ఎలాగూ స్టెప్పులు వేయాల్సిన అవసరం లేదు. అందుకే… ఇప్పుడే ఆపరేషన్ చేయించుకుంటే మంచిదని ఫిక్సయ్యారు. దానికి తగ్గట్టు మార్చి వరకూ ‘ఎన్టీఆర్’ పట్టాలెక్కదు. ఈలోగా కావల్సిన విశ్రాంతి దొరుకుతుంది. ఆపరేషన్ ఎక్కడ? ఎప్పుడు? అనే వివరాలు మాత్రం తెలియాల్సివుంది. బాలయ్య ఆపరేషన్ జరిగాక.. ఇలాంటి మాస్ స్టెప్పులు చూసే అవకాశం ఉండదేమో.