వెండితెరపై నందమూరి తారక రామారావు వారసత్వాన్ని నిలబెట్టిన హీరో నందమూరి బాలకృష్ణ. ఆ వారసత్వాన్ని ఈ తరానికి కూడా చేరువ చేసింది మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్. స్వర్గీయ ఎన్టీఆర్ పేరు, బాలకృష్ణ ఫ్యాన్ ఫాలోయింగ్లు స్టార్టింగ్ డేస్‌లో ఎన్టీఆర్‌కి చాలానే హెల్ప్ అయ్యాయి. కానీ ఆ తర్వాత మాత్రం ఎన్టీఆరే బాలకృష్ణకు హెల్ప్ అయ్యాడు. నందమూరి ఫ్యాన్ బేస్‌ని కాపాడటంలో ఎన్టీఆర్ కీ రోల్ ప్లే చేశాడు. ఈ రోజు ఖైదీ నంబర్ 150 సినిమాకి వస్తున్న క్రేజ్‌లో పవన్ కళ్యాణ్, బన్నీల సాయం కూడా చాలా ఎక్కువే ఉంది. మెగా ఫ్యాన్ బేస్‌ని బలపర్చింది పవన్ కళ్యాణే. జెనరేషన్ మారిపోయినప్పుడల్లా ఎవరైనా కొత్త హీరో వచ్చి ఆ తరం ప్రేక్షకులకు కూడా రీచ్ అవ్వబట్టే నందమూరి, మెగా, ఘట్టమనేని ఫ్యాన్ బేస్ నిలబడింది. టెంపర్ సినిమా నుంచీ బాలకృష్ణ, టిడిపి సపోర్ట్ లేకుండానే ఎన్టీఆర్ హిట్స్ కొడుతున్నాడు. చంద్రబాబు పుణ్యామాని ఎన్టీఆర్ సినిమాలకు వ్యతిరేకంగా పనిచేశారన్నది కూడా వాస్తవం. కానీ ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడూ ఎక్కడా తన ఆవేదనను బయటపెట్టలేదు. చంద్రబాబునాయుడు, బాలకృష్ణలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాగే టిడిపిని వీడాలన్న ఆలోచన ఎన్టీఆర్‌కి ఎప్పుడూ లేదు. రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని ఎన్టీఆర్ కోరుకున్నది కూడా లేదు. 2009లో వైఎస్‌ని ఎదుర్కోవడం చంద్రబాబుకి కష్టసాధ్యమవుతున్న పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ని ఒప్పించి రంగంలోకి దించింది చంద్రబాబే. ఎన్టీఆర్ కూడా శక్తివంచన లేకుండా తన స్థాయికి మించే కష్టపడ్డాడు. రాజకీయ సామర్థ్యాన్ని కూడా నిరూపించుకున్నాడు. ఎన్టీఆర్‌లో ఉన్న ఆ టాలెంట్ చూసిన చంద్రబాబే ఎక్కడ లోకేష్‌కి పోటీ అవుతాడో అన్న ఉద్ధేశ్యంతోనే ఎన్టీఆర్‌ని దూరం పెట్టేశాడు. 2009లో ప్రచారం చేయడం, ఆ తర్వాత చంద్రబాబుకు దూరమవడం అనే రెండు నిర్ణయాలు కూడా ఎన్టీఆర్ తీసుకున్నవి కాదు. చంద్రబాబు ఆడిన పొలిటికల్ గేం అది. కానీ అనుకూల మీడియా అండతో ఎన్టీఆర్‌ని వైఎస్ జగన్‌కి ఆత్మబంధువును చేసిపడేశాడు చంద్రబాబు. ఆ దుష్ప్రచారంతో ఎన్టీఆర్‌కి కలిగిన మానసిక వేదన, కెరీర్ పరంగా జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. వేరే వాళ్ళయితే పరిస్థితులు ఎలా ఉండేవో కానీ అక్కడున్నది ఎన్టీఆర్. బాల్యం నుంచీ పోరాటంతోనే పైకొచ్చినవాడు. ఎవ్వరి సపోర్ట్ లేకుండా సూపర్ స్టార్ రేంజ్‌కి ఎదిగిన ఎన్టీఆర్‌కి మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కడం అసాధ్యం అవుతుందా?
టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సిినిమాలతో సూపర్ హిట్స్ కొట్టి బౌన్స్ అయ్యాడు ఎన్టీఆర్. అదే టైంలో బాలకృష్ణతో సంబంధాలను పునరుద్ధరించుకోవడం కోసం కూడా తనవంతు ప్రయత్నాలు చేశాడు. బాలకృష్ణ భార్యను కూడా తన తల్లితో సమానంగా చూస్తాడు ఎన్టీఆర్. పైగా నందమూరి కుటుంబంలోని అందరితోనూ కలిసి ఉండాలనుకుంటాడు ఎన్టీఆర్. అందుకే కుటుంబంలోని సన్నిహితుల ద్వారా బాలకృష్ణను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు మంచి ప్రచారం లభించేలా తనవంతు ప్రయత్నం చేశాడు. కానీ బాలకృష్ణ మాత్రం ఎన్టీఆర్‌కి మరోసారి హ్యాండ్ ఇచ్చాడు. స్వర్గీయ జానకీరామ్ పిల్లల ఫంక్షన్‌కి అటెండ్ అవ్వలేదు. అలాగే శాతకర్ణి ఫంక్షన్‌కి హరికృష్ణతో పాటు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు ఆహ్వానం కూడా పంపించలేదు. ఇప్పుడు కూడా బాలకృష్ణకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ ఏమీ మాట్లాడడు. బాలకృష్ణ అంటే అంత అభిమానం ఎన్టీఆర్‌కి. కానీ నందమూరి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రం ఎంత బావ అయితే మాత్రం అన్నీ చంద్రబాబు చెప్పినట్టే చేయాలా? అని అడుగుతున్నారు. రాజకీయాల మాట ఎలా ఉన్నా నందమూరి కుటుంబ సభ్యుల విషయంలో బాలకృష్ణ ఆలోచనా తీరు మారాలంటున్నారు.