హిందూపురం జిల్లా కోసం జగన్‌ను అయినా కలుస్తానని బాలకృష్ణ ప్రకటించారు.శుక్రవారం మౌనదీక్ష చేసిన ఆయన శనివారం హిందూపురం నుంచి భారీ ర్యాలీగా అనంతపురం జిల్లాకు వెళ్లి కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిందేనని స్పష్టం చేశారు. జిల్లాకు ఏ పేరు అయినా పెట్టుకోవాలని.. తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదన్నారు. జిల్లా కేంద్రం కోసం దేనికైనా సిద్ధమేనన్నారు. హుటాహుటినా రాత్రికే రాత్రి జిల్లాల ఏర్పాటు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.
హిందూపురం పట్టణంలో అన్ని వసతులు ఉన్నాయని హిందూపురాన్ని కాదని మరో ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే సహించబోమని అన్నారు. ఇంతకు ముందు ప్రకటించిన విధంగా రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రజల న్యాయమైన డిమాండ్‌ను సాధించేవరకు ఎంతటి పోరాటాలకైనా రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు. హిందూపురం అంశంలో బాలకృష్ణ అగ్రెసివ్‌గా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ మినహా అందర్నీ ఏకతాటిపైకి తీసుకు రావడంలో సక్సెస్ అయ్యారు.
సత్యసాయిపేరు విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని.. చెబుతూ తెలివైన రాజకీయం చేస్తున్నారు. ప్రజలు కూడా హిందూపురం జిల్లాను వైసీపీ ఇస్తానంది కాబట్టి ఇవ్వాల్సిందేనని మాట తప్పవద్దని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న బాలకృష్ణ అనుకున్న విధంగా పనులు చేయించలేకపోతున్నారు. కానీ ఈ హిందూపురం సెంటిమెంట్‌తో దాన్ని అధిగమిస్తున్నారు. వైసీపీ నేతలకు ఈ పరిస్థితి మింగలేని కక్కలేని పరిస్థితి అయింది.