మన హీరోలు తెరపైనే కాదు. బయట కూడా హీరోలే. తమ ఉదారతని చాటుకునే అవకాశం ఎప్పుడొచ్చినా – స్పందిస్తుంటారు. మానవత్వం చూపిస్తుంటారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా అదే చేశారు. ఓ చిన్నారి వైద్యం కోసం తన వంతు సాయం చేశారు. వివరాల్లోకి వెళ్తే…
హైదరాబాద్ మల్కాజ్‌గిరికి చెందిన ఏడేళ్ల బాలిక మణిశ్రీ. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతోంది. నాలుగు నెలల క్రితం బసవతారకం ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందింది. వైద్యం నిమిత్తం సుమారు 7 లక్షలు కావల్సివచ్చింది. కొంతమంది దాతలు స్పందించారు. అయితే.. మరో 5.2 లక్షల బిల్లు ఆసుపత్రికి చెల్లించాల్సివచ్చింది. అయితే ఆ స్థోమత ఆ కుటుంబానికి లేదు. ఈ విషయం బాలకృష్ణ అభిమానులకు తెలిసింది. దాన్ని బాలయ్య దృష్టికి తీసుకెళ్లారు ఫ్యాన్స్. వెంటనే బాలయ్య స్పందించి ఆ బిల్లుని మాఫీ చేయించారు. ఇప్పుడు మణిశ్రీ కోలుకుంటోంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యింది. తమని ఆర్థికంగా ఆదుకుని, కుమార్తె చికిత్సకు సాయం చేసిన బాలయ్యకు ఆ కుటుంబం చేతులెత్తి మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటోంది.