ఆహాలో.. ‘అన్‌స్టాపబుల్’ అంటూ అదరగొడుతున్నాడు బాలయ్య. ఇప్పుడు ‘బిగ్ బాస్’ హౌస్‌లోనూ… అడుగుపెట్టబోతున్నట్టు టాక్. ‘బిగ్ బాస్ 6’కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ తరవాత.. నాగ్ తప్పుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ‘బిగ్ బాస్’ యాజమాన్యానికి నాగ్ సమాచారం చేరవేశారని, దాంతో బిగ్ బాస్… మరో హౌస్ట్ కోసం అన్వేషణలో పడిందని టాక్. అందులో భాగంగా… ‘బిగ్‌బాస్’ టీమ్ బాలకృష్ణని సంప్రదిస్తే.. బాలయ్య తన అంగీకారం తెలిపారని ఇన్ సైడ్ వర్గాల టాక్. బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా ఇది వరకు ఎన్టీఆర్, నాని, నాగార్జున వ్యవహరించారు. వాళ్లకంటే.. ఎక్కువ పారితోషికం బాలయ్యకు ఆఫర్ చేశారని, అందుకే బాలయ్య ఈ షో చేయడానికి ముందుకొచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే బాలయ్య ఈ షో చేయడానికి కొన్ని కండీషన్లు పెట్టారని, అందులో భాగంగానే వేదిక అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి.. మరో చోటికి మారే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి… బుల్లి తెరపై బాలయ్య `అన్ స్టాపబుల్` ఇన్నింగ్స్ కొనసాగుతూనే ఉందన్నమాట. బాలయ్య వస్తే ఈ షో మరింత ఎనర్జిటిక్‌గా మారడం ఖాయం. గత కొన్ని సీజన్లుగా `బిగ్ బాస్` రేటింగులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఈసారి.. మాత్రం అవి ఆకాశాన్ని తాకడం గ్యారెంటీ!