నందమూరి బాలకృష్ణ 99వ చిత్రం ‘డిక్టేటర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ వినాయక చవితి సందర్భంగా బుదవారం హైదరాబాద్ లో రిలీజ్ చేసారు. ఈ సినిమాలో అంజలి మొట్టమొదటిసారిగా బాలకృష్ణకి జంటగా నటిస్తోంది. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు వేదం అశ్వ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. కధ: గోపి మోహన్, కోన వెంకట్; సంగీతం: యస్. యస్. తమన్. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించబడతాయి.