ఎన్టీఆర్ బయోపిక్‌కి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా పకడ్బందీగా సాగుతున్నాయి. `ఎన్టీఆర్`గా బాలకృష్ణ లుక్ తరవాత… చంద్రబాబు (రానా), ఏఎన్నార్ (సుమంత్) లుక్‌లు బయటకు వచ్చాయి. అప్పుడప్పుడూ సందర్భం చూసుకుని బాలయ్య లుక్స్‌ని బయటకు తీసుకొస్తున్నారు. గురువారం ఎన్టీఆర్ టీమ్ నుంచి మరో సర్ప్రైజ్ రాబోతోంది. ఉదయం 9.35లకు ఎన్టీఆర్ టీమ్ నుంచి ఓ ప్రకటన రాబోతోంది. అదేమిటన్నది అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎన్టీఆర్ సినిమాని రెండు భాగాలుగా చూపిస్తారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. సంక్రాంతికి ఓ భాగం, మరో పది హేను రోజుల విరామంలో పార్ట్ 2 విడుదల చేస్తారని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అదే వార్తని అధికారికంగా ప్రకటించే ఛాన్సుంది. ఎన్టీఆర్ సినీ జీవితాన్ని తొలి భాగంలోనూ, రాజకీయ జీవితాన్ని రెండో భాగంలోనూ చూపిస్తారు. ఇది ఓ విధంగా మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా. రెండు సినిమాల్నీ పది హేను రోజుల వ్యవధిలో విడుదల చేయడం కూడా…. ఓ సాహసమే. ఓరకంగా చెప్పాలంటే.. తెలుగు సినీ చరిత్రలో ఇదో కొత్త ఆలోచన. ఎన్టీఆర్బృందం కూడా ఇదే న్యూస్‌ని బయట పెట్టబోతోందా? లేదంటే ఇంకాస్త పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతోందా? అనేది తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.