ఈ డిసెంబరులో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు నందమూరి బాలకృష్ణ. ఆయన ‘రూలర్’గా అవతరించబోతున్నాడు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. సి.కల్యాణ్ నిర్మాత. వేదిక, సోనాల్ చౌహాన్ కథానాయికలు. ఇటీవలే ఫస్ట్ లుక్ విడుదలైంది. బాలకృష్ణ రెండు అవతరాల్లో కనిపించబోతున్నాడు. పోలీస్ అధికారికగా, ఐటీ ఆఫీసర్‌గా ఆయన పాత్రలు ఉండబోతున్నాయి. ప్రస్తుతం కేరళలో ఓ పాట తెరకెక్కిస్తున్నారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రపీ అందిస్తున్నారు. ఇప్పడు టీజర్‌ని కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. వచ్చే వారంలో `రూలర్` టీజర్ రాబోతోంది. ఈ టీజర్లో బాలయ్య రెండు పాత్రల్నీ పూర్తిగా రివీల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. బాలయ్య సినిమా అంటే పవర్ ఫుల్ డైలాగులు తప్పనిసరి. ఇందులోనూ రెండు పంచ్‌లు విసరబోతున్నాడు బాలయ్య. గెట్ రెడీ ఫ్యాన్స్.