విశాఖ మన్యంలో కీలక నేతగా ఉన్న సివేరి దొన్నుదొర వైసీపీకి గుడ్ బై చెప్పి.. టీడీపీలో చేరడంతో… నష్ట నివారణ కోసం.. వైసీపీ .., జనసేన నేతపై గురి పెట్టినట్లుగా కనిపిస్తోంది. పాడేరుకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి బాలరాజును.. వైసీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీకి చెందిన కొంత మంది కీలక నేతలు ఇప్పటికే బాలరాజుతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. పసుపులేటి బాలరాజు.. తనకు ఇచ్చే ప్రాధాన్యత గురించి… చర్చలు జరుపుతున్నారని.. త్వరలోనే ఇవి కొలిక్కి వస్తాయని అంటున్నారు. బాలరాజు… వైఎస్ హయాంలో మంత్రిగా పని చేశారు. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడే. అయితే.. ఆయన జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు ఆయనతో నడవలేదు. కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపునే పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో పెద్ద పెద్ద నేతలు… కూడా.. డిపాజిట్లు తెచ్చుకోలేకపోయారు. కానీ.. పాడేరులో బాలరాజుకు ఉన్న పట్టు కారణంగా 21వేల ఓట్లు తెచ్చుకున్నారు. మళ్లీ 2019లో వైసీపీలో చేరేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. ఆయనను తీసుకునేందుకు వైసీపీ నేతలు ఆసక్తి చూపించలేదు. దీంతో ఆయన జనసేన పార్టీలో చేరారు. అయితే.. జనసేన పార్టీ తరపున పాడేరు నుంచి పోటీ చేసినప్పటికీ.. గతంలో సాధించినన్ని ఓట్లు కూడా సాధించలేదు. దాంతో.. బాలరాజు.. తన రాజకీయ భవిష్యత్ పై డోలాయమానంలో పడినట్లుగా కనిపిస్తోంది.
జనసేన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నప్పటికీ.. వైసీపీ నేతలు ఆహ్వానించడంతో.. ఆ పార్టీలో చేరికపై.. అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… పవన్ కల్యాణ్ ను రాజకీయంగా బలహీనం చేసేందుకు వ్యూహాలు పన్నుతున్న ప్రచారం జరుగుతునన నేపధ్యంలో… ఇలా.. జనసేన నేతలకు.. వైసీపీ నుంచి ఆఫర్లు రావడం ఆసక్తి కలిగిస్తోంది.