జగన్ రెడ్డి స్కామ్‌లు ఎలా చేస్తారో గుట్టంతా తెలిసిన ఆయన మాజీ బిజినెస్ పార్టనర్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఒకటొకటిగా అన్ని విషయాలు బయట పెడుతున్నారు. రూ.లక్షతో ప్రారంభమైన ఇండోసోల్ కంపెనీతో చేయబోతున్న అతి పెద్ద స్కాం వివరాలను ఆయన వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాలు చూస్తే.. ఐదేళ్లలో దోచుకున్న సొమ్ములో చాలా వరకూ ఈ కంపెనీ ద్వారా వైట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఎవరికైనా అర్థమవుతుంది.
రూ. లక్షతో ఇండోసోల్ కంపెనీ ప్రారంభమయింది. ఈ కంపెనీకి ఏపీ సర్కార్ ఇచ్చిన రాయితీలు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు. అచ్చంగా ఇరవై మూడు వేల కోట్లు. పేపర్ల మీద అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఈ కంపెనీకి ఉన్న ప్రాజెక్టులు, రాయితీలు చూపించి కంపెనీ విలువను విపరీతంగా పెంచేస్తున్నారు. ఎలా ఉంటే.. అచ్చంగా జగన్ రెడ్డి.. లక్ష పెట్టుబడితో ప్రారంభించిన భారతీ సిమెంట్స్ ను… కొన్ని వేల కోట్లకు ఎలా పెంచుకున్నారో అలాగే. మిగిలిన కంపెనీలను ఎలా పెంచుకున్నారో అలా అన్నమాట.
ఇండోసోల్ కంపెనీతో ఇప్పుడు వాల్యూయేషన్ గేమ్ నడిపిస్తున్నారు. ఎవరికీ తెలియకుండా విదేశీ కంపెనీకి వాటా కట్టబెట్టబోతున్నారు. అది కూడా భారీ వాల్యూకి. విదేశీ కంపెనీలు అంత తేలికగా కొంటాయా అనే డౌట్ అక్కర్లేదు. భారతి సిమెంట్స్ ను వికాట్ అనే కంపెనీ 51 శాతం వాటా కొనుగోలు చేసి రూ. రెండు వేల కోట్లు పదిహేనెళ్ల కిందటే చెల్లించింది. కానీ ఆ కంపెనీ పేరు మాత్రమే ఉంటుంది. అంతా జగన్ రెడ్డి అజమాయిషీలోనే ఆ కంపెనీ ఉంది. వాళ్లుఆ రెండు వేల కోట్లు ఎందుకిచ్చారో తేలదు.. ఎదుకంటే విచారణ జరగడం లేదు.
అలాగే ఇండోసోల్ వాటాలు కూడా ఊరూపేరూ లేని విదేశీ కంకెనీకి వేల కోట్లకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ వేల కోట్లు ఎక్కడ్నుచి వెళ్తాయో…ఎక్కడికి వస్తాయో.. ఊహించాల్సిన పని లేదు. బాలశౌరి ఇదే విషయాలను చెబుతున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా ఈ బాగోతం బయటపడక తప్పదని అంటున్నారు.