వైసీపీ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎంపీ బాలశౌరికి పవన్ కల్యాణ్ టిక్కెట్ ఖరారు చేయలేదు. మచిలీపట్నం స్థానానికి ఆయన పేరు ఖరారైందని కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది కానీ.. ఇప్పుడు వేరే పేర్లు తెరపైకి వస్తున్నాయి. బాలశౌరి విషయంలో పవన్ కల్యాణ్ ఎందుకో అంత సంతృప్తిగా లేరన్న వాదన వినిపిస్తోంది. అందుకే బాలశౌరి కూడా మచిలీపట్నంలో కార్యక్రమాలు తగ్గించారు.
అవనిగడ్డ అసెంబ్లీతో పాటు… మచిలీపట్నంకు అభ్యర్థుల్ని పవన్ ఎంపిక చేయాల్సి ఉంది. గ్రీన్ కో కంపెనీలో ఓ డైరక్టర్ పేరును పవన్ పరిశీలిస్తున్నారు. ఇదే గ్రీన్ కో కంపెనీలో కాకినాడ వైసీపీ ఎంపీ చలమలశెట్టి సునీల్ కుటుంబానికి నిర్ణయాత్మక వాటా ఉంది. ఇప్పుడు అదే కంపెనీ డైరక్టర్ కు కూటమి తరపున సీటు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. ఆయన కాకపోతే.. జనసేన తరపున వంగవీటి రాధాను నిలబెట్టాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. కానీ బాలశౌరి పేరు మాత్రం వెనుకబడిపోయింది.
అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ఎవరిని ఎంపిక చేయాలన్నది కూడా పవన్ కు సమస్యగా మారింది. టీడీపీ నేత బుద్దప్రసాద్ అనుచరులు… తమ నేతకే కేటాయించాలంటున్నారు. కానీ జనసేన తరపున ముగ్గురు పోటీ పడుతున్నారు. విక్కుర్తి శ్రీనివాస్ అనే పారిశ్రామికవేత్తవైపు పవన్ మొగ్గుచూపుతున్నారంటున్నారు. ఇక్కడ కూడా బాలశౌరి పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ..