నందమూరి తారక రామారావు ఆత్మకథని బాలకృష్ణ సినిమాగా తీయాలనుకొన్నారు. అందుకు సంబంధించిన స్క్రిప్టు వర్క్ కూడా జరిగిపోయింది. ఈ సినిమాకి రాంగోపాల్ వర్మని దర్శకుడిగా ఎంచుకొన్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమిటో.. ఎన్టీఆర్ బయోపిక్ ఆగిపోయిందన్న పుకార్లు ఎక్కువయ్యాయి ఈమధ్య. బాలయ్య వరుసగా కొత్త సినిమాలు సంతకాలు చేయడం, అందులో ఎన్టీఆర్ బయోపిక్ ప్రస్తావన లేకపోవడంతో బయోపిక్ ఆగిపోయిందనే అనుకొన్నారంతా. కానీ.. బాలయ్య ఈ ప్రాజెక్టు పక్కన పెట్టలేదు. అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్‌లోనే బిజీగా ఉన్నాడు. తాజాగా చెన్నై వెళ్లి.. అక్కడ కొంతమంది నిర్మాతలు, తన కుటుంబ సభ్యులతో మాట్లాడి.. ఈ స్క్రిప్టుకు పనికొచ్చే విషయాల్ని తెలుసుకొని వచ్చాడు. ఈ విషయాన్ని ‘పైసా వసూల్’ ఆడియో విజయోత్సవ వేడుకలో బాలయ్యే చెప్పాడు. ‘చెన్నై వెళ్లా. అక్కడ కొంతమంది నిర్మాతలతో మాట్లాడా. కంచుకోట, పెత్తందార్లు తీసిన నిర్మాతలో నాన్నగారికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకొచ్చా’ అని హింట్ ఇచ్చేశాడు బాలకృష్ణ. సో… ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన గ్రౌండ్ వర్క్ మళ్లీ మొదలైపోయిందన్నమాట. ఈ విషయంలో నందమూరి ఫ్యాన్స్ బెంగ పడాల్సిన అవసరం లేదు.