బాలయ్య భోళా శంకరుడు. ఆయన కోపం, ఆవేశం పక్కన పెడితే – ఓ సారి మాట ఇచ్చాడంటే…. దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నిలబెట్టుకుంటాడు. ఓ వ్యక్తి నచ్చితే… ఎప్పటికీ వదలడు. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో శ్రియని చూస్తే అర్థం అవుతుంది. గౌతమిపుత్ర శాతకర్ణిలో శ్రియని కథానాయికగా ఎంచుకున్నారు. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రియ బాలయ్యని ఆకాశానికి ఎత్తేసింది. `మీతో మళ్లీ నటించాలనివుంది` అని ప్రతీసారీ అడిగేది. ఆ మాటని గుర్తు పెట్టుకున్న బాలయ్య… `పైసా వసూల్`లో శ్రియని హీరోయిన్గా చేశాడు. దాంతో బాలయ్య ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకున్నట్టే. కానీ.. ఇప్పుడు మరోసారి శ్రియని ఆఫర్ ఇచ్చాడు బాలయ్య. సి.కల్యాణ్ నిర్మాతగా వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో శ్రియని కథానాయికగా ఎంచుకున్నారు. ఇది కూడా బాలయ్య రికమెండీషన్ ప్రభావమే. `ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు` అనే ప్రస్తావన వచ్చినప్పుడు `శ్రియని తీసుకోండి` అని అల్టిమేట్టం జారీ చేశాడట బాలయ్య. దాంతో కల్యాణ్, వినాయక్లకు మరో ఆప్షన్ లేకుండా పోయింది. చెన్నకేశవరెడ్డి, గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్.. ఇప్పుడు వినాయక్ సినిమా. ఇలా బాలయ్యతో నాలుగోసారి జోడీ కట్టబోతోంది శ్రియ. ఇదంతా బాలయ్య మహిమే.