బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న సంగతి అభిమానులకు సైతం తెలియంది కాదు. ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్లో వైరం లేదు కానీ, దూరం, దూరంగా ఉంటారంతే. ఒకరి దగ్గర మరొకరి టాపిక్కు రాదు.
అయితే… అన్స్టాపబుల్ లో భాగంగా ఇటీవల `డాకూ మహారాజా` టీమ్ ఎపిసోడ్ జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి బాలయ్య బాబీని అడిగాడని, అయితే ఎడిట్ లో అదంతా తీసేశారని ప్రచారం జరుగుతోంది. ‘మా వాడితో సినిమా తీశావ్కదా, అది కూడా మూడు పాత్రలు’ అంటూ… బాలయ్య ‘జై లవకుశ’ టాపిక్ తీసుకొచ్చాడని, దానికి బాబీ కూడా సమాధానం చెప్పాడని, అయితే ఎడిట్ లో దాన్ని తీసేశారన్నది టాపిక్. బాబీ హీరోలందరి ఫొటోల్నీ స్క్రీన్ పై చూపించి, వాళ్ల గురించి బాబీ అభిప్రాయాన్ని కనుక్కొన్నాడు. ఎన్టీఆర్ ఫొటో మాత్రం కనిపించలేదు. ‘జై లవకుశ’ గురించి ఏమాత్రం అడగలేదు.
ఇప్పుడే కాదు, ఇది వరకు కూడా ‘అన్ స్టాపబుల్’ లో ఎన్టీఆర్ ప్రస్తావన రాలేదు. ఇక మీదటా రాదు కూడా. అలాంటిది బాలయ్య ఎన్టీఆర్ గురించి ఎందుకు అడుగుతాడు? ఈ విషయంలో ‘అన్ స్టాపబుల్’ పీఆర్ టీమ్ ని సంప్రదిస్తే.. ‘ఎన్టీఆర్ గురించి ప్రశ్న ఈ ఎపిసోడ్ లో లేద’ని క్లారిటీ ఇచ్చింది.
బాలకృష్ణ సినిమా ‘డాకూ మహారాజ్’ ఈ సంక్రాంతికి వస్తుంది కదా. అందుకే యాంటీ బాలయ్య ఫ్యాన్స్ ఎలెర్ట్ అయ్యి, ఇలా లేనిపోని వార్తలు పుట్టిస్తున్నారు. ఆ మంటల్లో చలి కాచుకొందామన్నది వాళ్ల ప్లాన్. ఈ విషయంలో ఎన్టీఆర్, బాలయ్య ఫ్యాన్సే ఎలెర్ట్ గా ఉండాలి.