`ఎన్టీఆర్` పాటల విడుదల, ట్రైలర్ ఆవిష్కణ సభలో.. మరో తీపి కబురు నందమూరి అభిమానులకు చేరింది. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లోని సినిమాకి ముహూర్తం ఫిక్సయ్యింది. ఈ చిత్రాన్ని ఎన్బికె సంస్థ తరపున బాలకృష్ణ నిర్మించనున్నారు. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. వీరిద్దరి కాంబినేషన్లో సింహా, లెజెండ్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది ముచ్చటగా మూడోది.
ఎన్టీఆర్ ఆడియో ఆవిష్కరణ సభలో… దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ “నాకు రాయడం – తీయడం ఈ రెండే తెలుసు. ప్రతీ సినిమా నా మొదటి సినిమాలానే భావిస్తా. నా ప్రాణం పెట్టి పని చేస్తా. సింహా, లెజెండ్లకు పది శాతం మించిన సినిమానే చూపిస్తా“ అని నందమూరి అభిమానులకు మాటిచ్చారు బోయపాటి. ప్రస్తుతం `వినయ విధేయ రామ` సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు బోయపాటి. ఈ చిత్రం సంక్రాంతికే వస్తోంది. 9న `ఎన్టీఆర్` బయోపిక్ వస్తున్న సంగతి తెలిసిందే.