దసరా సందర్భంగా గౌతమి పుత్ర శాతకర్ణి 40 సెకన్ల టీజర్ బయటకు వచ్చింది. ఈ టీజర్‌పై డివైడ్ టాక్ వినిపిస్తోంది. టీజర్ అంత గొప్పగా లేదని, ఈ టీజర్‌తో చాలా ఆశించామని కొందరు చెబుతుంటే… బాలయ్య ఫ్యాన్స్ మాత్రం టీజర్ బ్రహ్మాండంగా ఉందని, డైలాగు అదిరిపోయిందని సంబర పడుతున్నారు. అయితే… టీజర్ ఈ తరహాలో కట్ చేయాలన్నది క్రిష్ ముందస్తు వ్యూహంలో భాగమే అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. టీజర్‌తో వాటిని రెట్టింపు చేయడం క్రిష్ కి ఇష్టం లేదు. అందుకే అండర్ ప్లే చేసినట్టు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ టీజర్ తో పాటు రెండు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ కూడా క్రిష్ కట్ చేశాడట. అది వేరే లెవిల్లో ఉందని సమాచారం. ఒకవేళ ఆ ట్రైలర్ బయటకు వస్తే.. ఇక ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోతాయని, వాటిని అందుకోవడానికి ఇబ్బంది పడాల్సివస్తుందని క్రిష్ భయపడుతున్నాడట.
డిసెంబరులో గౌతమి పుత్ర ఆడియో విడుదల కానుంది. అంతకంటే ముందే ట్రైలర్‌ని చూపించే అవకాశం ఉంది. ట్రైలర్లు, టీజర్లు చూపించి బిజినెస్ పెంచుకోవాలన్న ఉద్దేశం క్రిష్ కి లేదు. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయ్యింది. కాబట్టి.. తాయితీగా తన పని తాను చేసుకొందామన్న ఆలోచనలో ఉన్నాడట క్రిష్. టీజర్ ఎలా ఉన్నా క్రిష్ కట్ చేసిన ట్రైలర్ మాత్రం అద్భుతహ అనే స్థాయిలో ఉందని… ఆ ట్రైలర్ బయటకు వస్తే.. బాలయ్య అభిమానులు సంబరాలు చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. శరణమా, రణమా అనే డైలాగ్ శాంపిల్ మాత్రమేనట. బుర్రా సాయిమాధవ్ ఈ సినిమా కోసం చరిత్రలో గుర్తుండిపోయే డైలాగులు రాశాడట. ఉగాది విశిష్టత వివరిస్తూ రాసిన డైలాగ్ చిరస్థాయిగా గుర్తుండిపోనున్నదని, ఆ డైలాగ్ ట్రైలర్ కోసం అట్టి పెట్టారని సమాచారం.