నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాలో డైలాగులు అదరగొట్టేస్తాడు.. రోమాలు నిక్కబొడుకునే డైలాగులు చెప్పాలన్నా.. శతృసైన్యాయనికి చెమటలు పట్టించేలా రెచ్చిపోవాలన్నా.. తనకు ఎదురు నిలిచిన వాడికి చుక్కలు చూపించాలన్నా అది బాలయ్య ఒక్కడి వల్లే సాధ్యం.. నీ ఇంటికొచ్చా నీ నట్టింటి కొచ్చా.. అంటూ బాలయ్య చెప్పిన సమరసింహా రెడ్డి డైలాగ్ ఎన్ని రికార్డుల మోత మోగించిందో తెలిసిందే. అయితే స్క్రీన్ పై డైలాగులు పర్ఫెక్ట్ గా చెప్పే బాలయ్య బాబు లైవ్ వేదికలల్లో కాస్త కన్ ఫ్యూజ్ గా మాట్లాడతాడనే ఇన్నర్ టాక్ ఉంది. అయితే బాలయ్యకున్న సాంస్కృతిక పరిజ్ఞానం ఇప్పటి స్టార్ హీరోలకు ఎవరికి లేదు ఉండదు కూడాను.
ఏదైనా ఒక సందర్భాన్ని ఇతిహాసాలతో పోల్చే బాలకృష్ణ అప్పుడప్పుడు కాస్త నోరు జారతారు. అయితే అది మనసులో ఏదో పెట్టుకుని అన్నవి కాదు సరదాగా నలుగురిని నవ్వించడం కోసం అన్న మాటలు మాత్రమే. అలానే నిన్న సావిత్రి ఆడియోకి గెస్ట్ గా వచ్చిన బాలయ్య బాబు నోరు జారి ఓ మాట అనేశాడు. బాలయ్య స్టార్ హీరో కాబట్టి ఆ మాటలను ఎవరు వక్రీకరించే సాహసం చేయలేదు కాని ఏ సగటు హీరోనో అలా మాట్లాడి ఉంటే మ్యాటర్ చాలా దూరం వెళ్లేది. ఇంతకీ బాలయ్య బాబు ఏమన్నాడు అంటే.. హీరోయిన్స్ విషయాల గురించి.. లవ బోయ్ ఇమేజ్ గురించి మాట్లాడుతూ తను హీరోయిన్ వెంట పడితే ఫ్యాన్స్ ఒప్పుకోరని.. ఆ ఫ్లోలోనే అమ్మాయికి ముద్దైనా పెట్టాలి కడుపైనా చేయాలి అనేశారు.
అయితే తన అభిప్రాయంలో హీరోయిన్స్ తో లవ్ సీన్స్ లాంటివి పెట్టడం ఫ్యాన్స్ కు నచ్చదు. తన స్టైల్ అంతా వేరే అనే సందర్భం వచ్చేలా చెప్పిన మాటలవి. పరిశ్రమలో ఎవరు ఏ తప్పు మాట మాట్లాడితే దాన్ని హైలెట్ చేస్తూ మాట్లాడుదామా అనుకునే రోజులివి మరి బాలయ్యను ఈ సందర్భంగా డైరెక్ట్ గా టార్గెట్ చేయకపోయినా దీనికి సంబంధించిన పంచ్ ఎక్కడో ఓ చోట నుండి రావడం మాత్రం ఖాయం అని ఫిలిం నగర్ లో మాట్లాడుకుంటున్నారు.