ఎన్టీఆర్ బయోపిక్ ముందే… బాలకృష్ణ ఓసినిమా చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. వినాయక్, కె.ఎస్.రవికుమార్, అనిల్ రావిపూడి.. ఇలా చాలామంది దర్శకుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. సి.కల్యాణ్ చాలా కథలు విన్నారు. అయితే… ఆయన గురి వినాయక్‌పైనే. వినాయక్ మాత్రం `నాకు కొంచెం టైమ్ కావాలి` అంటూ తన నిర్ణయాన్ని చెప్పడానికి బాగా మొహమాటపడ్డాడు. ఇప్పుడు.. `ఓకే` చేసేసినట్టు సమాచారం. బాలయ్య – వినాయక్‌ల కాంబో దాదాపుగా ఫిక్సయ్యిందన్నది ఇండ్రస్ట్రీ వర్గాల సమాచారం. ఈ వారంలోనే.. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ యేడాదే.. ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది లక్ష్యం. వినాయక్ స్పీడ్ స్పీడుగా సినిమాలు తీసేవాడే. బాలయ్య కీ తొందర ఎక్కువే. అందుకే.. ఈ కాంబినేషన్‌ని కల్యాణ్ సెట్ చేయగలిగాడని టాక్. ఇదో యాక్షన్ ఎంటర్టైనరని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఒకట్రెండు రోజులు ఆగాల్సిందే.