నందమూరి బాలకృష్ణ – వినాయక్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందని జోరుగా ప్రచారం సాగుతోంది. సి.కల్యాణ్ కూడా.. ఈ విషయంలో స్పందించాడు. ‘అవును.. సినిమా చేస్తున్నాం’ అని ప్రకటించేశాడు. దాంతో అది కాస్త అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయిపోయింది. అయితే… ఇలా తన ప్రమేయం లేకుండా వార్తలు రావడం బాలయ్యకు నచ్చలేదని తెలుస్తోంది. అందుకే సి.కల్యాణ్‌ని గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు ఇన్సైడ్ వర్గాల టాక్. బాలయ్య ప్రస్తుతం.. ఎన్టీఆర్ బయోపిక్‌తో బిజీగా ఉన్నాడు. ఈ వారంలోనే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. వినాయక్ కథని బాలయ్య ఇప్పటి వరకూ వినలేదు. వినాయక్ కూడా కథ రెడీ చేసుకోలేదు. ఇద్దరి మధ్యా సిట్టింగ్ జరగాల్సివుంది. ఇంతలోనే కల్యాణ్ తొందరపడి ఓ స్టేట్మెంట్ ఇచ్చేశాడు.
ఒకట్రెండు రోజుల్లో ‘ఎన్టీఆర్’ బయోపిక్ కి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన రానుంది. దాంతో అసలు ఎన్టీఆర్ సినిమా షెడ్యూలేంటి? అనేది తెలిసిపోతుంది. ఆతరవాతే… మరో సినిమా చేయాలా, వద్దా? అనే నిర్ణయం తీసుకుంటాడట బాలయ్య. మొత్తానికి తేలిన విషయం ఏమిటంటే.. బాలయ్య – వినాయక్ కాంబో ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. ఇది వినాయక్ చెప్పిన కథని బట్టే కాదు, బాలయ్య మూడ్‌ని బట్టి కూడా ఆధారపడి ఉంది.