అదానీతో ఒప్పందాల్లేవని.. నేరుగా కేంద్రంతోనే డీల్స్ పెట్టుకున్నామని వైసీపీ ఎంతగా బుకాయిస్తున్నా అసలు నిజం కళ్ల ముందే ఉంది. అప్పటి విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అదే చెబుతున్నారు. ఆ విద్యుత్ ఒప్పంద పత్రాన్ని అర్థరాత్రి పూట నిద్రలేపి మరి సంతకం చేయాలని ఒత్తిడి చేశారని కానీ చేయనని చెప్పేశానని అందుకే కేబినెట్ ముందు పెట్టి ఆమోదించుకున్నారని ఆయన చెబుతున్నారు.
జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మొదటి మూడేళ్ల వరకూ బాలినేని విద్యుత్ మంత్రిగా ఉండేవారు. అయితే అందరు మంత్రుల్లా ఆయనకు ఏ విషయం తెలిసేది కాదు. పెట్టమన్నదగ్గర సంతకాలు పెట్టడం.. సమస్యలు వచ్చినప్పుడు సజ్జల ఆఫీసు నుంచి వచ్చిన స్క్రిప్టుల్ని చదవడం మాత్రమే ఆయన చేసిన పని. కానీ తన పేరుతో స్కాములు చేయకుండా చూసుకున్నానని ఆయన అనుకుంటున్నారు. సెకీ విద్యుత్ స్కాం విషయంలో అసలు తనకేమీ తెలియదని తాను ఎక్కడా సంతకాలు పెట్టలేదని ఆయనంటున్నారు.
వైసీపీ ఎంత వింత వాదన చేసినా జరగాల్సింది జరుగుతుంది. అమెరికా కోర్టులో ఏం జరిగినా.. ఈ స్కాం విషయంలో కేంద్రం, దర్యాప్తు సంస్థలు ఎలా స్పందిస్తాయన్నది కీలకం. ముడుపులు పుచ్చుకున్నట్లుగా అంతర్గత విచారణ చేసి తేలుస్తారా లేకపోతే.. అదానీ వ్యవహారం
కాబట్టి పైపై విచారణ చేస్తారా లేకపోతే అసలు చేయరా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.