ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎక్కడా కష్టం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కేసినో అన్నా… హవాలా మనీ అన్నా ముందుగా అందరూ ఆయన వైపే అనుమానంగా చూస్తున్నారు. దీంతో ఆయన వివరణ ఇచ్చుకోక తప్పడం లేదు. తాజాగా చీకోటి ప్రవీణ్ కేసినో , హవాలాలో బాలినేని కూడా కీలకమన్న ప్రచారం జరిగుతోంది. దీంతో ఆయన వెంటనే మీడియాకు ముందుకు వచ్చారు.
కేసినో నిర్వాగకుడు చీకోటి ప్రవీణ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. తాను పేకాట ఆడతానని ఒప్పుకుంటాన్నారు అప్పుడప్పుడూ కేసినోకీ పోయివస్తూంటానన్నారు. అంత మాత్రాన చీకోటి ప్రవీణ్ కేసినోతో కానీ ఆయన హవాలాతో కానీ తనకు సంబంధం ఉన్నట్లు కాదన్నారు. ఇటీవలి వరకూ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి పేకాట, కేసినో వ్యసనపరుడని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వీటిని ఖండిస్తూ ఉంటారు. దమ్ముటే నిరూపించాలని సవాల్ చేస్తూంటారు.
కొద్దిరోజుల కిందట ఒంగోలు నుంచి చెన్నైకు తరలిస్తున్న రూ. ఐదు కోట్ల నగదును తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆ నగదు అంతా బాలినేని శ్రీనివాసరెడ్డి హవాలా రూపంలో పంపుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. . బాలినేని పై ఈ రకమైన ఇమేజ్ ఉండటతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కేసినోలు.. హవాలా కేసుల గురించి చర్చకు వచ్చినా ఆయన పేరు ప్రచారంలోకి వస్తోంది. ఉద్దేశపూర్వకంగా టీడీపీ నేతలు ఇలా ప్రచారం చేస్తున్నా… బాలినేని శ్రీనివాసరెడ్డికి మాత్రం వివరణ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.