బాలినేని శ్రీనివాసరెడ్డి తమపై జగన్ రెడ్డి అభిమానం చూపడం లేదని ఫీలయ్యారు కానీ..ఇప్పుడు తెగింపుకొచ్చేశారు.. తనకు తాను టిక్కెట్లు ప్రకటించుకున్నారు. తన పుట్టిన రోజు వేడుకల్ని బలప్రదర్శనగా నిర్వహించిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు . అంతే కాదు ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. బాలినేని ప్రకటనతో ప్రకాశం జిల్లా వైసీపీలో అలజడి ప్రారంభమయిది.
బాలినేని బెదిరింపుల కోసమో.. ఆవేదనతోనో చేస్తున్న వ్యాఖ్యలతో వైవీ సుబ్బారెడ్డి సైలెంట్ రాజకీయం చేస్తున్నారు. బాలినేని సొంత పార్టీపై కుట్ర చేస్తున్నారని ఆయన టీడీపీలో చేరే ప్లాన్ లో ఉన్నారని జగన్ రెడ్డి వద్ద నూరిపోస్తున్నారు. దీంతో జగన్ ఆయనను మరింత దూరం పెడుతున్నారు. మాగుంట, బాలినేని ఇద్దరూ టీడీపీలోకి వెళ్తారని ప్రచారం చేస్తున్నారు. కానీ బాలినేని ఇంత వరకూ టీడీపీతో సంప్రదింపులు చేయలేదు. చేర్చుకునే ఉద్దేశం కూడా టీడీపీకి లేదు. కానీ వైవీ సుబ్బారెడ్డి ప్లన్ వైవీది.
అందుకే ఇప్పుడు తెగించి.. తనకే టిక్కెట్ అని.. బాలినేని ప్రకటించుకున్నారు. మంత్రి పదవి ఊడినప్పటి నుండి బాలినేనికి గడ్డు పరిస్థితి ఉంది. చివరికి ఆయన జగన్, వైవీ సుబ్బారెడ్డి వ్యూహంలో నిండా మునుగుతున్నట్లుగా కనిపి్సతోంది.