సీఎం జగన్ను సొంత బంధువులు కూడా నమ్మడం లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఆయనను నమ్మితే నట్టేట మునుగుతానని అర్థం చేసుకున్నారు. రీజినల్ కోఆర్డినేటర్ గా బాలినేని రాజీనామా చేయడం..వేరే పార్టీల్లో చేరుతారంటూ ప్రచారం జరగడం దానికి మీడియాలో విస్తృత ప్రచారం లభించడంతో జగన్ తో మాట్లాడాలని సీఎంవో అధికారులు పిలిచారు. రీజినల్ కోఆర్డినేటర్ గా కొనసాగాలని ఏం కావాలో చెప్పాలని జగన్ కోరారు. ఆయన మాటలు విని బాలినేని.. ఓ విచిత్రమైన నవ్వు నవ్వి..ఏమీ వద్దని.. తాను నియోజకవర్గానికే పరిమితమవుతానని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటి వరకూ తాను ఎన్నో చెప్పానని.. చివరికి ప్రకాశంటూర్ సందర్భంగా కూడా చెప్పానని అవేమీ చేయకుండా ఇప్పుడు మళ్లీ జగన్ ఏమీ తెలియనట్లు అడగడంతో బాలినేని కూడా ఫీలయ్యారని అంటున్నారు. అనారోగ్యం.. .ఇతర కారణాలతో పార్టీ బాధ్యతలు తీసుకనని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనికి జగన్ కూడా సరే అన్నట్లుగా చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో పెత్తనం ఇచ్చేందుకు సిద్ధమని.. సుబ్బారెడ్డి కన్నా బాలినేనికే ప్రాధాన్యం ఇస్తామని సంకేతాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. కానీ బాలినేని మాత్రం నమ్మలేదంటున్నారు.
తాను పార్టీ కార్యక్రమాలకు దూరం కావటం లేదని.. కేవలం రీజనల్ కో ఆర్డినేటర్ బాధ్యతల నుండి మాత్రమే తప్పుకుంటున్నట్లు బాలినేని పార్టీ పెద్దలకు స్పష్టం చేశారు. జగన్మోహన రెడ్డిపై బాలినేని పూర్తి స్థాయిలో నమ్మకం కోల్పోయారని అందుకే పిలిచి చెప్పినా వినలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.