ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా కరోనా సోకింది. ఆయన కూడా… ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెట్టుకోలేదు. నేరుగా అపోలోకే వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. ఇప్పటి వరకూ.. అధికార పార్టీగా వైసీపీలో ఉన్న వారు.. ఎవరు కరోనా బారిన పడినా… పొరుగు రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రులకే పరుగులు పెడుతున్నారు. విజయసాయిరెడ్డి దగ్గర్నుంచి అంబటి రాంబాబు వరకూ అందరిదీ అదే బాట. ప్రభుత్వం…అత్యున్నత స్థాయి వైద్య సౌకర్యాలు అందిస్తోందని.. మాటలు చెబుతోంది కానీ.. చేతల్లో మాత్రం.. తమ సొంత వైద్యంపై నమ్మకం లేక…, పొరుగు రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుకు పరుగులు పెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ రోగులకు అందిస్తున్న చికిత్స ఎలాంటిదో… అధికార పార్టీ నేతలకు బాగా తెలుసని… ఈ కారణంగానే విమర్శలు వస్తున్నాయి. వైద్యం కోసం ప్రజలు తమపై తెస్తున్న ఒత్తిడితో… కొంత మంది ప్రజాప్రతినిధులు.. మీడియా ముందే… అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రచారాన్ని నమ్మి ఎవరైనా నేతలు ప్రభుత్వ కోవిడ్ సెంటర్లలో చేరినా.. వెంటనే… ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారు. తెలంగాణలో 80ఏళ్లు దాటిన నేతలు.. కరోనా బారిన పడినా… కోలుకున్నారు. కానీ 59 ఏళ్ల మాణిక్యాలరావు కరోనా బారిన పడి .. ప్రభుత్వ కోవిడ్ సెంటర్లో చేరారు. వారానికే ఆయన పరిస్థితి సీరియస్గా మారడంతో.., విజయవాడ ప్రభుత్వాసుపత్రికి మార్చాల్సి వచ్చింది. కానీ ప్రయోజనం లేకపోయింది.
మాణిక్యాలరావు, సున్నం రాజయ్య లాంటి నేతలు.. కరోనాతో చనిపోవడంతో… పాజిటివ్ వచ్చిన వారెవరూ.. నిర్లక్ష్యం చేయడం లేదు. వెంటనే..హైదరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరిపోతున్నారు. వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం.. ఆయన కుమారుడికి కూడా పాజిటివ్ వచ్చింది. వారు కూడా.. హైదరాబాద్ స్టార్ హాస్పిటల్లో చేరినట్లుగా తెలుస్తోంది. ఎక్కడ వైద్యం చేసుకోవాలో వారి ఇష్టం కానీ.. ఇలా చేయడం వల్ల సొంత ప్రభుత్వం ఇస్తున్న వైద్యంపై.. భరోసాను.. ప్రజలకు ఇవ్వలేకపోతున్నారు.