https://www.youtube.com/watch?v=3tnsDr4OGtw
తెలుగులో హారర్ కామెడీ సినిమాలు ఎక్కువయ్యాయి. ఇది చాలదన్నట్టు తమిళం నుంచి కూడా డబ్బింగ్ రూపంలో దిగబడుతున్నాయి. అయితే.. వచ్చిన రోజే ఆయా సినిమాలు సర్దుకొని వెళ్లిపోతుండడంతో – హారర్ కామెడీలపై మోజు తగ్గింది. అయితే… ‘బెలూన్’లో ఆకర్షించే అంశాలు కొన్ని కనిపిస్తున్నాయి. అంజలి, జై కలసి నటించిన సినిమా ఇది. అంజలి తెలుగువాళ్లకు బాగా తెలుసు. ఇక్కడి అమ్మాయే. జై కూడా పరిచయమే. దానికి తగ్గట్టు ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని టాక్. దాంతో… ఈ సినిమాపై ఫోకస్ పెరిగింది. తెలుగు టీజర్ విడుదల చేశారిప్పుడు. ఓ ఇల్లు.. అందులో ఆత్మ.. అక్కడ భయోత్పాదనం అనే పాత కాన్సెప్టు ఈ సినిమాలోనూ కనిపిస్తోంది. అయితే ఆత్మ ‘బెలూన్’ని ఓ పరికరంగా వాడుకోవడం ఈ సినిమా ప్రత్యేకత. విజువల్స్ ఆకట్టుకొనేలా ఉన్నాయి. యువన్ శంకర్ రాజా అందించిన ఆర్.ఆర్ కూడా హారర్ సినిమాలకు తగ్గట్టుగానే ఉంది. కామెడీ మిక్స్ చేయకుండా… హారర్ సినిమాని హారర్ సినిమాలనే అందించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. జై.. ‘ఖైది నెం.150’లోని క్వాయిన్ ఫైట్ని గుర్తు చేసేలా.. చివర్లో యాక్షన్ సన్నివేశాల్లో కనిపించాడు. ఇద్దరు ప్రేమికులు (అంజలి, జై) చేసిన ఈ సినిమా… ఎలాంటి ఫలితాన్ని తీసుకొస్తుందో చూడాలి.