తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆడియో, ప్రిరిలీజ్ ఫంక్షన్ల వేడుకలను.. ప్రత్యక్ష ప్రసారం చేసుకునే అవకాశాన్ని గతంలో అన్ని చానళ్లకూ ఇచ్చేవారు. తర్వాత అసోసియేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్స్..ఎల్ఎల్పీని ఏర్పాటు చేసుకున్న యాక్టివ్ ప్రొడ్యూసర్లు… తమ సినిమా వేడుకల హక్కులను… కేవలం మూడు చానళ్లకే ఇవ్వాలని నిర్ణయించారు. అందులో మొదటిది టీవీ నైన్ , రెండోది ఎన్టీవీ, మూడోది తెంలగాణ చానల్. మిగతా చానళ్ల నుంచి నిరసన వ్యక్తమైనా… ప్రొడ్యూసర్స్ ఎల్ఎల్పి దీనికే కట్టుబడి ఉంది. దానికి కారణం.. ఆ మూడు చానళ్ల నుంచి కొంత ఆదాయం… ఆయా సినీ నిర్మాతలకు వస్తుంది. అప్పుపప్పుడూ.. ఎక్కవ మొత్తం ఆఫర్ చేసి.. టీవీ ఫైవ్ కూడా లైవ్ టెలికాస్ట్ హక్కులను కొనుగోలు చేస్తోంది. కానీ ప్రస్తుతం శ్రీరెడ్డి అనే నటీమణి పెట్టిన రచ్చలో.. టీవీ నైన్ పై .. మెగా కాంపౌండ్ ఫైర్ అవుతోంది. వీరి హిట్ లిస్ట్ లో టీవీ నైన్, టీవీ ఫైవ్ ఉన్నాయి.
మెగా ఫ్యామిలీకి TV9 పై మొదటి నుంచి పీకల మీద వరకు కోపం ఉంది. నాడు ఇన్ని చానళ్లు లేనప్పుడు కూడా… చిరంజీవి చిన్న కూతురు ప్రేమ వ్యవహారం విషయంలో… TV9 సంచలతనాత్మక జర్నలిజాన్ని ఫాలో అయింది. దాంతో పవన్ కల్యాణ్ అప్పట్లోనే తుపాకీ పట్టుకుని TV9 ఆఫీసుకు బయలు దేరి మధ్యలో పోలీస్ స్టేషన్ రావడంతో అక్కడ తుపాకీ అప్పగించేశారు.ఆ తర్వాత కత్తి మహేష్, ఇప్పుడు శ్రీరెడ్డి విషయంలోనూ… టీవీ నైన్ తమ కుటుంబాన్నే టార్గెట్ చేయడాన్ని.. మెగా క్యాంప్ జీర్ణించుకోలేకపోతోంది. ఇలా వదిలిేస్తే… తమపై .. నెగెటివ్ గా ప్రసారాలు చేస్తూనే ఉంటారని…డిసైడయింది. అందుకే..సినీ పెద్దలపై ఒత్తిడి తెచ్చి.. టాలీవుడ్ కు సంబంధించిన ఏ కార్యక్రమానికి కూడా… టీవీ నైన్ కు ఆహ్వానం అందకుండా చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే చరచ్లు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అలాగే టీవీ ఫైవ్ ని కూాడా హిట్ లిస్ట్ లో పెట్టారు. కానీ ఆ చానల్ లో పనిచేసే సాంబశివరావు అనే జర్నలిస్టునే పవన్ టార్గెట్ చేశారు కాబట్టి… టీవీ ఫైవ్ విషయంలో మెగా క్యాంప్… టీవీ నైన్ ని బహిష్కరించినట్లుగా .. బహిష్కరించమని డిమాండ్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది.
మొత్తానికి మెగా క్యాంప్.. తమకు అవమానం జరిగిందని డిసైడయింది. దానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. మొదట రాంగోపాల్ వర్మ.. ఆ తర్వాత… టీవీ నైన్ వీరి హిట్ లిస్ట్ లో ఉన్నరు. వర్మపై బ్యాన్ చేసేసి… టీవీ నైన్ ను టాలీవుడ్ కు దూరంగా నెట్టేస్తే ..మెగా ఫ్యామిలీ సంతృప్తి పడే అవకాశం ఉంది. ఇతర నిర్మాతలకు ఇష్టం లేకపోయినా.. ఇండస్ట్రీలో ఇప్పుడు మెగా ఫ్యామిలీ చాలా బలంగావుంది కాబట్టి… శనివారం జరిగే సమావేశంలో… టీవీ పైన్ బై బ్యాన్ విషయాానికి ఆమోద ముద్ర పడే అవకాశ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే… ఎన్టీవీకి పండగే.