అనేక సార్లు టెండర్లు పిలిచినా ఎవరూ రాలేదు.. చివరికి మేఘా మాత్రమే ముందుకు వచ్చింది. ఆ కంపెనీకే కాంంట్రాక్ట్ ఇచ్చారు. .. సేమ్ స్టోరీ బందరు పోర్టు విషయంంలోనూ రిపీట్ అయింది. పోర్టు నిర్మాణానికి ఎపి మారిటైం బోర్డుతో మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఒప్పందం చేసుకుంది. నవంబర్ నెలాఖరులోపు కేంద్రం అనుమతులు లభిస్తాయని అనంతరం పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
మొదటి దశలో పోర్టుకు సంబంధించి నాలుగు బెర్తులు నిర్మించాల్సి ఉంది. ఇందుకుగానూ ఎపి మారిటైం బోర్డు రూ.5,155.73 కోట్లతో టెండర్లు ఆహ్వానించింది. రూ.3,668.83 కోట్లతో మెగా ఇంజినీరింగ్ సంస్థ టెండరు దాఖలు చేసి ఎల్ వన్‌గా నిలిచింది. ఈ సంస్థతో మారిటైం బోర్డు ఒప్పందాన్ని పూర్తి చేసుకుంది. కేంద్ర పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాత కాంట్రాక్టు సంస్థకు డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ (నిర్మాణ కాల పరిమితి)పై లెటర్‌ను మారిటైం బోర్డు ఇవ్వనుంది. ఒప్పందం ప్రకారం భూమి పూజ తర్వాత 30 నెలల వ్యవధిలో కాంట్రాక్టు సంస్థ నిర్మాణం పూర్తి చేయాలి.
నిజానికి బందరు పోర్టు రాజకీయ పార్టీలకు ఓ కల్పతరువుగా మారింది. పోర్టు నిర్మాణం పూర్తయితే కృష్ణా జిల్లాలో పారిశ్రామికావృద్ధికీ అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రజలను పోర్టు పేరుతో ఆశపెట్టి రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయి. 2008లో పోర్టు నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్న మైటాస్ సంస్థ రూ.100 కోట్లకుపైగా బ్యాంకు రుణాలు తీసుకుంది. కానీ పైసా పనులు చేపట్టకుండా చేతులెత్తేసింది. గత ప్రభుత్వం నవయుగ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 2019 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పనులను ప్రారంభించారు. వేగంగా పనులు చేసినా.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం కొద్ది రోజులకే ఆ ఒప్పందాన్ని రద్దు చేశారు. ఇప్పుడు మూడున్నరేళ్ల తర్వాత మళ్లీ మేగాకు ఇస్తున్నారు.
ఏపీలలో రివర్స్ టెండర్లలో మేఘా దక్కించుకున్న పనులు ఏమీ ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా పోలవరం వంటి ప్రాజెక్టులు పడకేశాయి. బందరుపోర్టును కూడా నిర్మిస్తారన్న నమ్మకం ఎవరికీ లేదు.