తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను సోషల్ మీడియాలో బద్నాం చేయడానికి కొంత మంది నెట్ వర్క్‌గా ఏర్పడి విస్తృతమైన ప్రచారం చేశారు. ఆయనకు రూ. ఆరు వందల కోట్ల ఆస్తులున్నాయని గ్రానైట్ వ్యాపారుల్ని బెదిరించి పెద్ద ఎత్తున సంపాదించారని… సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ నేరుగా ఆయా రాజకీయ పార్టీలు లేదా వ్యక్తులు చేసి ఉంటే..దానికి బండి సంజయ్ సమాధానం ఇచ్చేవారు. కానీ.. అలా ప్రచారం చేస్తున్న వారు అందరూ.. ప్రముఖ మీడియా సంస్థల లోగోలను ఫేకింగ్ చేసి.. ఆయా చానళ్లు, పత్రికల్లో వచ్చినట్లుగా మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తున్నారు. దాంతో వాటిని ప్రజలు నమ్ముతారేమో అన్న ఆందోళన బండి సంజయ్‌తో పాటు బీజేపీలోని ఆయన వర్గంలో ప్రారంభమయింది.
టీవీ9తో పాటు బీజేపీ సపోర్ట్‌గా ఉంటుందని పేరున్న వెలుగు సహా అన్ని మీడియా సంస్థలను టార్గెటెడ్‌గా వాడేశారు. విస్తృతంగా సర్క్యూలేట్ చేశారు. మొదట్లో కాస్తే తేలిగ్గా తీసుకున్న బీజేపీ.. తర్వాత విపరీతంగా ప్రచారం అవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.కానీ ప్రయోజనం లేకపోవడంతో.. నేరుగా కేంద్ర హోంశాఖకుఫిర్యాదు చేశారు. కానీ జరగాల్సిన ప్రచారం మాత్రం జరిగిపోతూనే ఉంది. ఈ ప్రచారాన్ని ఎవరు చేశారో..చేయిస్తున్నారో కూడా బీజేపీ నేతలు గుర్తించలేకపోతున్నారు. బండి సంజయ్ పై.. బీజేపీలోని ఓ వర్గం గుర్రుగా ఉందని కొంత మంది… టీఆర్ఎస్ అధినేతపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్న కారణంమగా టీఆర్ఎస్ నేతలే ఆయనపై ఇలా ప్రచారం చేయిస్తున్నారని మరికొంత మంది అనుమానిస్తున్నారు.
రాజకీయ నేతల ఆస్తుల ప్రకారం చూస్తే బండి సంజయ్ నిరుపేద కిందనే లెక్క. ఆయన ఎప్పుడూ పదవిలో లేరు. కార్పొరేటర్‌గా మాత్రం ఉండేవారు. అనేక సార్లు ఎన్నికల్లో ఓడిపోయారు. ఎంపీ ఎన్నికల్లో మాత్రం గెలిచారు. డబ్బులు సంపాదించేపదవుల్లో ఎప్పుడూ లేరు. అయితే బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత ఆయన సంపాదించారని ప్రచారం చేస్తున్నారు. తనకు ఆ ఆస్తలు ఉంటే చూపించాలని. .ఆయన నేరుగానే సవాల్ చేస్తున్నా… ఫేక్ ప్రచారం చేస్తున్న వారు స్పందిచడం లేదు. వారి ప్రచారం వారు చేస్తున్నారు.