బండి సంజయ్ చేసే ఆరోపణలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. అందరూ ఆశ్చర్యపోతూంటారు. నిజమని ఎవరూ నమ్మలేరు. అయినా ఆయన అలాంటి ఆరోపణలు ఆపలేరు. తాజాగా కేసీఆర్ పై అలాంటి ఆరోపణలే చేశారు. అదేమిటంటే..కేసీఆర్కు బీదర్లో దొంగ నోట్ల ప్రెస్ ఉందట. గత ఎన్నికల్లో ఆయన దొంగ నోట్లనే పంచి పెట్టారట. ఇంకా ఇతర విమర్శలు చేశారు కానీ.. ఈ దొంగ నోట్ల ప్రెస్ విమర్శ మాత్రం హైలెట్గా నిలుస్తోంది.
బీదర్ కర్ణాటకలో ఉంది. కేసీఆర్ పెట్టాలనుంటే తాను అధికారంలో ఉన్న తెలంగాణలో పెట్టాలనుకుంటారు కానీ పక్క రాష్ట్రంలో పెడతారా ?. ఎదుకంటే గత ఎన్నికలకు ముందే ఉందని.. బండి సంజయ్ అంటున్నారు. ఈ బిజారే ఆరోపణలు ఆయన ఎందుకు చేస్తారో కానీ మీడియా అటెన్షన్ అయితే వస్తుంది. అందుకోసమే చేస్తున్నారేమో కానీ.. ప్రజలు మాత్రం ఎలా నమ్ముతారని మాత్రం ఆలోచించడం లేదు.
బండి సంజయ్ కేంద్ర మంత్రి గా ఉన్నా.. అసలు పని కన్నా తెలంగాణ రాజకీయాల్లోనే ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తనకే అవకాశం ఇవ్వాలని ఆయన గట్టిగా అడుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ఇలాంటి ఆరోపణలతో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.