తెలంగాణ రాష్ట్రం నుంచి ఐదుగురి పేర్లను పద్మ అవార్డుల కోసం సిఫారసు చేస్తే ఒక్కరికి కూడా ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి ఫీలయ్యారు. వారందరూ తెలంగాణ కోసం పోరాడిన వారేనని ఎందుకు ఇవ్వరని రిపబ్లిక్ డే అధికారిక వేదిక నుంచే ప్రశ్నించారు. నిరసనగా లేఖ కూడా రాస్తానన్నారు. ఈ అంశంపై బండి సంజయ్ విచిత్రంగా స్పందించారు. గద్దర్ కు బరాబర్ అవార్డులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఆయన బీజేపీ నాయకుల్ని చంపించాడని చెప్పుకొచ్చారు.
బీజేపీ భావజాలం ప్రకారమే కాదు.. గద్దర్ ది కళా రంగం అయినా ఆయన ఎక్కువగా నక్సల్స్ కు సపోర్టు చేశారు. ఈ కారణం ఆయనకు పద్మశ్రీలు లాంటివి ఇవ్వడం కష్టమే. అయితే ఆయన తర్వాత చాలా మారి పోయారు. అయితే అలా చెప్పాల్సిన పని లేదు. ఆయన బీజేపీ నేతల్ని చంపించి ఉండరు.కానీ నక్సల్స్ కు సపోర్టు చేశారన్నది బహిరంగ రహస్యం. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం నక్సలైట్లకు ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తారు కానీ.. అవార్డులు ఇవ్వరా అని ప్రశ్నిస్తోంది.
పద్మ అవార్డులు దేశ అత్యున్తన పురస్కారాలు.. ఇతరులకు స్ఫూర్తి కలిగించే వారికి ఇస్తారు. బీజేపీ తన విధానంలో గద్దర్ కు ఇవ్వకూడదు అనుకుంటే.. సైలెంట్ గా ఉంటే సరిపోతుంది కానీ.. ఇలాంటి కామెంట్స్ చేస్తే రియాక్షన్ భిన్నంగా ఉంటుంది. మరి మిగతా వాళ్లకు ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నలు కూడా వస్తాయి. బండి సంజయ్ కు ఇప్పుడు అదే సమస్యగా మారింది.