బండి సంజయ్ ఫోన్ మిస్సింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది. బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు.. .. తర్వాత హైదరాబాద్ తీసుకు వచ్చిప్పుడు కూడా ఆయన ఫోన్ వాడుతూ కనిపించారు. ఆ దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. కానీ తర్వాత వరంగల్ సీపీ ఫోన్ ను బండి సంజయ్ ఇవ్వలేదని ప్రకటించారు. ఇప్పుడు బండి సంజయ్ తన ఫోన్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. నిజానికి ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకున్నప్పు డు పోలీసులు ముందుగా ఫోన్లను స్వాధీనం చేసుకుంటారు. కానీ బండి సంజయ్ విషయంలో అలా చేయలేదు.
అసలు కేసు.. వాట్సాప్ కు టెన్త్ పేపర్ వచ్చిందని… నిందితుడు బండి సంజయ్ కు ఫోన్ చేశారనే. అవే ఆధారాలు అయినప్పటికీ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకోలేదంటే ఎవరూ నమ్మడం లేదు. బండి సంజయ్ తన ఫోన్ ను పోలీసులే తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. అందులో చాలా రహస్యాలు ఉన్నాయని అంటున్నారు. ఆ రహస్యాలు ఏమిటంటే… ఫిరాయింపు ఎమ్మల్యేల గుట్టు అట. మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది తనకు ఫోన్ చేసి మాట్లాడారని, అది తెలిసి కేసీఆర్కు మూర్ఛ వచ్చినట్టుందని ఎద్దేవా చేశారు. తన ఫోన్ బయటికొస్తే చాలా విషయాలు తెలుస్తాయనే.. కేసీఆర్ వద్దే పెట్టుకుని ఉంటారని ఆరోపించారు.
ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఫోన్ లో చాలా వివరాలుంటాయి. ప్రత్యర్థులకు కావాల్సిన సమాచారం ఉంటుంది. గతంలో కాంగ్రెస్ వార్ రూమ్ పై సీఐడీ పోలీసులు ఎటాక్ చేసి సునీల్ కనుగోలు వ్యూహాలన్నీ తీసుకెళ్లిపోయారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇప్పుడు … అదే పద్దతిలో బండి సంజయ్ వ్యూహాలను కూడా ఆ ఫోన్ ద్వారా కనుగోని ఉటారని బీజేపీ వర్గాలంటున్నాయి. మొత్తంగా బండి సంజయ్ ఫోన్ దొరికే వరకూ హాట్ టాపిక్ గానే ఉండే చాన్స్ ఉంది.