తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్… తాను పవన్ కల్యాణ్‌ను కలవబోతున్నానని ప్రకటించారు. ఆ వెంటనే.. జనసేన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఓ లేఖ దర్శనం ఇచ్చింది. అదేమిటంటే.. పొత్తు చర్చల కోసం బండి సంజయ్ వస్తున్నారని.. రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని.. ఆ ప్రకటన సారాంశం. దీన్ని చూసి అందరూ నిజమే అనుకున్నారు. కానీ వెంటనే బండి సంజయ్ పవన్ కల్యాణ్ గాలి తీసేశారు. పవన్ కల్యాణ్‌తో తనకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి కానీ… పొత్తుల కోసం ఆయనను కలవడం లేదని తేల్చేశారు.
అసలు జనసేనతో పొత్తు అంశం బీజేపీలో చర్చకు రాలేదని.. అలాగే.. పొత్తులపై జనసేన నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కుండబద్దలు కొట్టేశారు. గ్రేటర్ లో ఒంటరిగా పోటీ చేయటానికి మా ఏర్పాట్లు పూర్తయ్యాయని కూడా.. చెప్పి.. జనసేనకు తలుపులు మూసేశారు. తను పవన్ కల్యాణ్‌కు.. పవన్‌కల్యాణ్‌కు తను చాలా దగ్గర అని.. ఇద్దరి మధ్య మధ్యవర్తులు అవసరం లేదని.. ఏ విషయం ఉన్నా ఫోన్ లో మట్లాడుకుంటు ఉంటామని చెప్పుకొచ్చారు. బండి సంజయ్ రెస్పాన్స్‌తో జనసేన పార్టీ గాలిపోయినట్లయింది.
కలిసి పోటీ చేసే అంశం పరిశీలిస్తారని.. కనీసం పదో.. ఇరవయ్యో డివిజన్లలో పోటీ చేయాలని.. జనసేన నేతలు అనుకున్నారు. కానీ బీజేపీ మాత్రం.. జనసేన గాలి తీయడానికే… ప్రయత్నాలు చేసినట్లుగా కనిపిస్తోంది. బండి సంజయ్.. పవన్ కల్యాణ్‌ను ఎందుకు కలవాలనుకున్నారో.. అది పొత్తుల కోసమే అని జనసేన ఎందుకు అనుకుందో కానీ.. చివరికి.. బేజీపే మిత్రుడిగానే తప్ప.. పోటీకి పనికి రాదన్నట్లుగా జనసేన పరిస్థితిని హైదరాబాద్‌లో మార్చేశారు బీజేపీ నేతలు.