హైదరాబాద్: పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘గబ్బర్‌సింగ్’ వంటి బంపర్ హిట్‌తోపాటు బాద్షా, టెంపర్, తీన్మార్, గోవిందుడు అందరివాడేలే, ఇద్దరమ్మాయిలతో వంటి చిత్రాలను నిర్మించిన బండ్ల గణేష్ ఈ మధ్య బొత్తిగా కనిపించటంలేదు. ఏమిటా అని చూస్తే కోళ్ళ ఫారంలో కోడిగుడ్లు ఏరుతూ కనిపించాడు.
బండ్ల గణేష్ ఆఖరుగా తీసిన సినిమాలు గోవిందుడు అందరివాడేలే, టెంపర్ రు.40 కోట్ల మైలురాయిని అధిగమించినప్పటికీ నిర్మాతకు పెద్ద లాభాలు తీసుకురాలేదన్నది తెలిసిందే. టెంపర్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్‌కు, గణేష్‌కు మధ్య పారితోషికం విషయంలో విభేదాలు వచ్చాయని వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. జూనియర్ కంటే రాంచరణే బెటర్ అన్నట్లుగా గణేష్ ట్వీట్లు చేశాడు. మరోవైపు మాణిక్‌చంద్ గుట్కా సంస్థకు చెందిన నటుడు సచిన్ జోషి భాగస్వామిగా అతనే హీరోగా తీసిన ‘నీ జతగా నేనుండాలి’ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ చిత్రం ఆర్థిక లావాదేవీల విషయంలో గణేష్‌కు, సచిన్‌కు మధ్య చెడటం, సచిన్ గణేష్‌పై చెక్ బౌన్స్ కేసు వేయటం కూడా జరిగింది. వీటన్నింటితో గణేష్ ప్రస్తుతం చిత్ర నిర్మాణాన్ని ఆపేసినట్లున్నాడు. ట్విట్టర్లో అతను పెట్టిన ఫోటోలు చూస్తే తమ కుటుంబ వ్యాపారమైన పౌల్ట్రీ రంగంలోకి వెళ్ళిపోయినట్లు కనిపిస్తున్నాడు. షాద్‌నగర్ ప్రాంతంలో గణేష్‌కు మొదటినుంచి పౌల్ట్రీ వ్యాపారం ఉంది. అసలు ఆ వ్యాపారంలోనే గణేష్ కుటుంబం మొదట సంపాదించింది. అయితే బొత్స సత్యనారాయణ బినామీ అని అందరూ అంటుంటారు.