నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ని బంజారా హిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై 420, 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రముఖ నిర్మాత, పీవీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకే గణేష్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఎన్టీఆర్ తో `టెంపర్` అనే చిత్రాన్ని నిర్మించాడు గణేష్. ఆ సమయంలో పీవీపీ నుంచి దాదాపు 7 కోట్లు ఫైనాన్స్గా తీసుకున్నారు. ఆ బాకీ చెల్లించమని అడిగినందుకు గణేష్ తమపై దాడిని పాల్పడ్డాడని ఇది వరకే పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ లోని పీవీపీ ఇంట్లో గణేష్ తన అనుచరులతో కలిపి వీరంగం చేశాడని, తనని బెదిరించాడని తాజాగా మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు పీవీపీ. అయితే మంగళవారం రాత్రి నుంచి గణేష్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. కొంతసేపటి క్రితమే పోలీసులు గణేష్ని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం బంజారా హిల్స్ ఏసీపీ కార్యాలయానికి గణేష్ని తరలించారు.