నటుడు, నిర్మాత బండ్ల గణేష్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇకపై తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘కుటుంబ బాధ్యతలు, వ్యాపారాలు.. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం, మిత్రుత్వం గానీ లేదు. అందరూ నాకు ఆత్మీయులే. ఇంతకుముందు నావల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమిస్తారని ఆశిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు బండ్ల.
తెలంగాణ కాంగ్రెస్ లో చేరారు బండ్ల గణేష్. ఎమ్మెల్యేగా పోటీ చేసేందు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆసక్తి చూపారు. కానీ, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో డీలాపడ్డారు. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు రాజకీయాలకు సంబంధించిన అంశాలపై ట్విటర్లో పోస్టులు, ఓ టీవీ ఛానల్ కనిపించారు కానీ, ఎక్కడా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇప్పుడు రాజకీయాలు దూరం అంటూ నిర్ణయం తీసుకున్నారు.