నక్షత్రం ఫ్లాపుతో మళ్లీ మెగాఫోన్ పట్టలేదు కృష్ణవంశీ. అయితే ఇన్నాళ్లకు మళ్లీ `యాక్షన్.. కట్` చెప్పబోతున్నారు. ఈచిత్రానికి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. కృష్ణవంశీ – చరణ్ కాంబినేషన్లో వచ్చిన `గోవిందుడు అందరివాడేలే`కీ గణేష్ నిర్మాత. కథ సిద్ధమైంది. త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రావొచ్చు. `నక్షత్రం`కంటే ముందు కృష్ఱవంశీ ఓ లేడీ ఓరియెంట్ సినిమా చేద్దామనుకున్నాడు. `రుద్రాక్ష` అనే పేరు కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు అదే కథ ని కాస్త మార్చి తెరపైకి తీసుకొస్తున్నారని టాక్. కథానాయికగా అగ్ర హీరోయినే కనిపించబోతోంది. డేట్లు ఫైనల్ అయ్యాక హీరోయిన్ తో సహా ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటిస్తారు. రాజకీయాల్లోంచి మళ్లీ సినిమాల వైపు దృష్టి పెట్టిన తరవాత గణేష్ చేస్తున్న సినిమా ఇది. కాబట్టి కాస్త భారీ తారాగణంతోనే ఉండబోతోందని తెలుస్తోంది.