బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఢిల్లీ వేదికగా జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో క్రీడాస్ఫూర్తిని మంటగలిపింది. క్రికెట్ చరిత్రలో ఆటగాళ్ళు వాడడానికి ఇష్టపడని ఓ రూల్ ని వాడుకొని నిజంగా ఆటని ప్రేమించే అభిమానుల ఆగ్రహానికి గురైయింది. అసలు ఏం జరిగిందంటే.. 25వ ఓవర్లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ వేసిన రెండో బంతికి లంక ఆటగాడు సమరవిక్రమ ఔట్ అయ్యాడు. దీంతో ఎంజిలో మాథ్యూస్ బ్యాటింగ్కు దిగాడు.
అయితే మైదానంలోకి అడుగుపెట్టే సమయంలో అతడి హెల్మెట్ స్ట్రాప్ పాడైయింది. దీంతో కొత్త హెల్మెట్ కోసం డ్రెస్సింగ్ రూం వైపు సిగ్నల్ ఇచ్చాడు. అలా అతడు క్రీజులోకి రావడం ఆలస్యమైంది. బాల్ ని ఎదుర్కోవానికి మూడు నిముషాలు కంటే ఎక్కువ సమయం తీసుకున్నాడని, టైమ్డ్ ఔట్ రూల్ ప్రకారం అతన్ని అవుట్ గా ప్రకటించాలని షకీబ్ ఎంపైర్ కి అప్పీల్ చేశాడు. దీంతో ఎంపైర్ అవుట్ ఇచ్చాడు.
ఏమిటీ టైమ్డ్ ఔట్ రూల్:
ఐసీసీ నిబంధనల ప్రకారం క్రీజులో ఉన్న బ్యాటర్ ఔట్ అయితే.. తర్వాతి బ్యాటర్ రెండు నిమిషాల్లో క్రేజ్ లోకి వచ్చి బంతిని ఎదుర్కోవాలి. దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటే..బౌలింగ్ చేస్తున్న జట్టు ఎంపైర్ కి అప్పీల్ చేయొచ్చు. అయితే ఈ రూల్ ని ఎవరూ వాడాలని అనుకోరు. ఎంపైర్స్ కూడా దిన్ని ఒక నిబంధనగా చూసి దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయరు. క్రికెట్ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు కూడా. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి జట్టు తగిన స్టాండర్డ్స్ తోనే వుంటుంది. ఎప్పుడైన చిన్నపాటి ఆలస్యం జరిగినా.. ప్లేయర చేతిలో వాచ్ కట్టుకొని మరీ ఎదురుచూడరు.
షకీబ్ అల్ హసన్ తీరు మాత్రం చాలా దారుణంగా వుంది. నిజానికి ఇలా అప్పీల్ చేస్తే ఆ అప్పీల్ ని మళ్ళీ విరమించుకునే రైట్ కూడా ఆటగాడికి వుంటుంది. మాథ్యూస్ .. షకీబ్ దగ్గరికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేశాడు. తన హెల్మెట్ పాడైయిందని చూపించాడు. కానీ షకీబ్ మాత్రం పట్టించుకోలేదు. చాలా సేపు మైదానంలో వున్నాడు మాథ్యూస్. షకీబ్ ఆప్పీల్ ని వెనక్కి తీసుకొని వుంటే.. మాథ్యూస్ ఆడేవాడు. కానీ కనీస క్రీడాస్ఫూర్తి లేకుండా వ్యవహరించాడు. దీంతో చరిత్రలో టైమ్డ్ ఔట్ రూల్ ప్రకారం అవుట్ అయిన తొలి బ్యాట్స్ మ్యాన్ గా మాథ్యూస్.. క్రీడాస్ఫూర్తిని తుంగలో తొక్కిన జట్టుగా బంగ్లాదేశ్ నిలిచిపోయాయి.
ఈ సంఘటనపై సర్వాత్ర బంగ్లాదేశ్ పైనే విమర్శలు వెళ్ళువెత్తుతున్నాయి. మాథ్యూస్ రూల్ పాటించలేకపొయిండొచ్చు. కానీ తన పరిస్థితి చెప్పి దాదాపు బ్రతిమాలుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ షకీబ్ అల్ హసన్, బంగ్లాదేశ్ జట్టు కర్కశంగా వ్యవహరించిన తీరు ఎంతమాత్రం అభినందనీయం కాదు.