బంగ్లాదేశ్ ప్రజలతో సంబంధం లేకుండా పాలనా పగ్గాలు చేపట్టిన మైక్రో ఫైనాన్స్ వ్యాపారి అయిన మహమ్మద్ యూనస్ ఆ దేశాన్ని మరింతగా భ్రష్టుపట్టించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్, చైనా, అమెరికాలు ఏం కోరుకుంటున్నాయో అలా చేస్తూ.. తన సొంత దేశాన్ని పణంగా పెడుతున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత పెంచుతూ.. కెనడా తరహాలో దౌత్యవేత్తలపై రుబాబుకు పాల్పడుతున్నారు. హిందువులు అయిన సొంత ప్రజలపై దారుణాలు చేస్తూ… భారత్ ను మరింతగా సవాల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. యూనస్ వ్యవహారం ప్రపంచ దేశాల్లో చర్చకు కారణం అవుతోంది.
తాజాగా సరిహద్దుల్లో యుద్ధాల్లో ఉపయోగించే డ్రోన్లను సిద్దంగా ఉంచి.. నిఘా పెంచడంతో యూనస్.. బంగ్లాదేశ్ ను నాశనం చేయడానికే రెడీ అయిపోయారన్న వాదన వినిపిస్తోంది. బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తూంటే ఉక్రెయిన్ లా మారుతుందేమో అన్న అభిప్రాయం వినిపిస్తోంది. నాటో దేశాలు తన వెనుక ఉన్నాయన్న గర్వంతో ఉక్రెయిన్ రష్యాతో ఆడాయి పెట్టుకుంది. కానీ రష్యా దాడుల తర్వాత ఉక్రెయినా నాశనం అయిపోయింది. నాటో ఇప్పటికీ ఆయుధాలు ఇచ్చి యుద్ధాన్ని ఎగదోస్తోంది కానీ ఆపడం లేదు. ఇందులో నష్టపోయింది ఉక్రెయినే. ఇపుడు చైనా వంటి దేశాల మద్దతుతో ఏదో చేద్దామనుకుంటున్న బంగ్లాదేశ్ కు రేపు అదే పరిస్థితి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
భారత్ లో షేక్ హసీనా ఆశ్రయం పొందుతోందని భారత్ పై ప్రజల్ని రెచ్చగొడుతున్నారు యూనస్. అయితే బంగ్లాలో ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదు. హసీనా ప్రసంగాలను కూడా వినిపించకుండా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రజాభిప్రాయాన్ని తొక్కేసి.. దేశాన్ని తమ చేతుల్లో ఉంచుకోవాలనుకుంటున్నారు. అందు కోసం భారత్ తో యుద్ధానికితెగబడుతున్నారు. భారత్ ఒక్క రోజు దాడులు చేస్తే. బంగ్లాదేశ్ సైన్యం ..అంతా నిర్వీర్యం అయిపోతుంది. అయినా యూనస్ కోరుకుంటోంది తమ దేశ నాశనమే.