బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా – బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది. ఈ సిరీస్ లో బంగ్లాదేశ్ జట్టుని తేలిగ్గా తీసుకోవడానికి లేదు.

ఇటీవలే పాకిస్థాన్‌ను తన సొంత గడ్డపై ఓడించిన బంగ్లాదేశ్‌ సంచలనం సృష్టించింది. ఇండియాతో కూడా మరో సంచలనం నమోదు చేయాలనే పట్టుతో వున్నారు బంగ్లా ఆటగాళ్ళు. ఇప్పుడు ఆ జట్టు సమతూకంలో వుంది. సీనియర్లతోపాటు కొత్త కుర్రాళ్లు కూడా అదరగొట్టేస్తున్నారు. పాక్ బ‌ల‌మైన జ‌ట్టే. కానీ బంగ్లా ముందు తేలిపోయింది. ఇటు బౌలర్లు, అటు బ్యాటర్లు కలసికట్టుగా రాణించారు బంగ్లా టైగ‌ర్స్‌. వన్డేలో టీమ్‌ఇండియాని ఓడించిన రికార్డ్ బంగ్లాకి వుంది. టెస్ట్ సిరిస్ క్రికెట్ సిరిస్ పాక్ ని ఓడించిన ఆ జట్టు ఇప్పుడు భారత్‌తో సిరీస్‌లో కూడా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.

అయితే ఇండియా లాంటి బలమైన జట్టుని ఓడించడం బంగ్లాదేశ్ కి అంత సులువు కాదు. కాకపోతే ఇండియా కూడా ఆ జట్టుని తేలిగ్గా తీసుకోకూడదు. ఎలాంటి సంచలనానికి చోటివ్వకుండా చిన్నపాముని కూడా పెద్ద కర్రతో కొట్టాలనే జాగ్రత్తతో ఆడాల్సిన బాధ్య‌త‌ టీమ్‌ఇండియా పై వుంది. ఇండియా కూడా దాదాపుగా పూర్తి స్థాయి జ‌ట్టుతోనే బరిలో దిగ‌బోతోంది. రోహిత్, కోహ్లీ, రాహుల్, అశ్విన్‌, బుమ్రా లాంటి అనుభ‌వ‌జ్ఞుల‌తో పాటుగా గిల్‌, జైస్వాల్, స‌ర్ఫ్‌రాజ్ ఖాన్‌చ‌, ధృవ్ లాంటి యువ‌కుల‌తో జ‌ట్టు ప‌టిష్టంగా క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు – జగన్ హయాంలో అపచారం!

తిరుమలలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని తేలిపోయింది. చివరికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ క్వాలిటీ అత్యంత ఘోరంగా ఉండేది. దానికి కారణం...

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి

తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి. ఓ వైపు పొలిటికల్ వాక్యూమ్ ను ఉపయోగించుకుని రాజకీయ నాయకుడు అయిపోవడానికి విజయ్ కొత్త పార్టీ పెట్టారు. మరో వైపు అన్నాడీఎంకే కూడా బలమైన క్యాడర్ తో ఉంది....

వైసీపీ ఆఫీసులకూ అదే పరిస్థితి – లా ఒక్కటే !

నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో .. వైసీపీకి కూడా గుండెల్లో రాయి పడింది. బీఆర్ఎస్ పార్టీకి అదొక్కదానికే అనుమతుల్లేవేమో కానీ వైసీపీకి చెందిన ఒక్క ఆఫీసుకు తప్ప...

దేవరని రామాయణంతో ముడిపెట్టిన పరుచూరి

రచయిత పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' పేరుతో సినిమాల‌ను విశ్లేషిస్తుంటారు. ఆయన విశ్లేషణలు చాలా ప్రజాదరణ పొందాయి. తన అనుభవాలన్నీ జోడిస్తూ సినిమాల్లోని లోటుపాట్లని, మంచి విషయాల్ని చెపుతుంటారు. తాజాగా ఎన్టీఆర్ దేవర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close