బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాతిపిత బాపూ అంటూ సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించారు కేసీఆర్ వేడుకలకు దూరంగా ఉన్నా, ఆ పార్టీ నేతలు మాత్రం మన తెలంగాణ బాపూ అంటూ ప్రచార హోరు సాగించారు. కేసీఆర్ బాపూ ప్రచారం శనివారం వాట్సప్, ఫోన్ కాల్స్ ద్వారా విస్తృతంగా చేశారు. కేసీఆర్ ప్రతిష్ఠ పెంచేలా ఆడియో, వీడియో పాటలు రిలీజ్ చేశారు. పార్టీ నాయకుల ప్రకటనలు.. ఫ్లెక్సీల్లో తెలంగాణ బాపు అనే ట్యాగ్ ను కేసీఆర్కు ఇచ్చారు.
నిజానికి కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా ప్రకటించుకోవాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. మూడోసారి గెలిచిన తర్వాత అదే చేయాలనుకున్నారు. కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్ అన్నట్లుగా చేయాలనుకున్నారు. కానీ దానికి ప్రకృతి సహకరించలేదు. మూడో సారి ఎన్నికల్లో ఓడిపోయారు. అదీ కూడా గ్రేటర్ లో తప్ప ఎక్కడా కేసీఆర్ ను ఆదరించలేదు. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ నిలబడాలంటే..కేసీఆర్ ఇమేజే ముఖ్యమని..ఆయన తెలంగాణ సాధించారు కాబట్టి ప్రజంలతా ఆయనను గుర్తుంచుకోవాలన్నట్లుగా బీఆర్ఎస్ ప్లాన్ ఉంది.
కేసీఆర్ పదేళ్ల పాలనపై, కాళేశ్వరం అవినీతి దందాపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఆయన ఇమేజ్ను పెంచేందుకు, తెలంగాణ బాపూగా ప్రచారం సాగిస్తున్నారు. రేపు అవినీతిపై చర్యలు తీసుకున్నా తెలంగాణ బాపుపై చర్యలు తీసుకున్నారని గగ్గోలు పెట్టవచ్చని ప్లాన ్చేసుకుంటున్నారు. కేసీఆర్ ఒక పార్టీ నాయకుడే కాదని, యావత్ తెలంగాణ సమాజానికి జాతిపిత బాపూ అని అంటున్నారు. ఈ ప్రచారం ముందు ముందు మరింత ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఓటమిలోఉంది. ఇలా ప్రచారం చేయడాన్ని ఎక్కవ మంది ట్రోల్ చేస్తున్నారు. ఇది సరైన సమయం కాదని అంటున్నారు. కానీ ఇప్పుడు కాకపోతే లోక్ సభ ఎన్నికల తర్వాత అసలు ప్రచారం చేయలేమని.. బీఆర్ఎస్ నేతలకు కూడా బాగా తెలుసన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.