జయహో బీసీ అంటూ.. వైసీపీ నేతలు సభ నిర్వహించి .. చంద్రబాబును తిట్టించి వారం కూడా కాలేదు. అప్పుడే బీసీల పదవులన్నీ నిర్వీర్యం అయిపోయాయి. బీసీ కార్పొరేషన్ల పాలక వర్గాల సమయం పూర్తయిపోయింది. వారిని కొనసాగించేందుకు జీవో ఇస్తారని ఎదురు చూసినా ఇంత వరకూ ఇవ్వలేదు. దీంతో ఆ పదవులు పొందిన వారంతా నిరాశకు గురయ్యారు. ప్రభుత్వం ఆ కార్పొరేషన్లకు చైర్మన్లుగా కొత్త వారిని నియమిస్తుందా.. లేకపోతే.. పార్టీ నేతల మధ్య పోటీ కోసం.. అలా ఖాళీగా ఉంచి.. పొలిటికల్ గేమ్ అడుతుందా అన్నది వైసీపీలోనే హాట్ టాపిక్ అవుతోంది.
ప్రతీ కులానికి ఓ కార్పొరేషన్ అని గతలోనే జగన్ ప్రకటించారు. ఆ ప్రకారం కాకపోతే.. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. డైరక్టర్లను నియమించారు. వారికి ఎంతో కొంత గౌరవ వేతనం ప్రకటించారు. ఇచ్చారా లేదా.. ఇస్తారా అన్నది మాత్రం ఇంకా రాలేదు..కానీ వారి రెండేళ్ల పదవీ కాలం ముగిసింది. ఈ రెండేళ్లలో ఆ ఆయా కార్పొరేషన్లకు పైసా కూడా ఇవ్వలేదు. పథకాల డబ్బులే వర్గీకరించి.. ఇదిగో కార్పొరేషన్ జాబితాలో ఇస్తున్నామని చెబుతున్నారు. అంతకు మించి ఆయా కులాల్లో యువత స్వయం ఉపాధి కోసం ఎలాంటి సాయం చేయలేకపోయారు. ఇప్పుడు పదవులు కూడా నిర్వీర్యం అయిపోయాయి.
నిజానికి ఈ కార్పొరేషన్లకు చట్టబద్ధత లేదు. సాధారణంగా కార్పొరేషన్లను కంపెనీల చట్టం కింద నమోదు చేస్తారు. ఇలా చేయడం వల్ల.. అవి స్వతంత్రంగా పని చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్లను సొసైటీలు, స్వచ్ఛంద సంస్థలుగా రిజిస్టర్ చేసింది ప్రభుత్వం. సొసైటీలు, స్వచ్చంద సంస్థలుగా రిజిస్టర్ చేయడం వల్ల.. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా డిమాండ్ చేసే అవకాశం లేదు. పార్టీ నేతలకు పదవులు కల్పించడానికి ఈ కార్పొరేషన్లు పెట్టారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పదవులను కూడా తీసేశారు.
అదే ఓ రెడ్డి సలహాదారుడి పదవీ కాలం ముగుస్తోందంటే.. రెండు రోజుల ముందే జీవో రిలీజ్ అయిపోతుంది.. కొనసాగిస్తూ. ఒక వేళ జీవో రాకపోతే… ఆయనను కొనసాగిస్తారు.. తర్వాత ఎప్పుడైనా జీవో ఇచ్చి… మొదటి నుంచి జీత భత్యాలు కల్పిస్తారు. మరి ఈ బీసీ కార్పొరేషన్ల పదవులు పొందిన వైసీపీ నేతలను ఏం చేస్తారో ?