టీం ఇండియా టెస్ట్ ఫార్మాట్ లో పేలవమైన ప్రదర్శనతో చాలా విమర్శలు ఎదురుకుంది. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్ళపై విమర్శలు వెళ్ళువెత్తాయి. వరుసగా రెండు టెస్ట్ సిరిస్ లు ఓడిపోయి డిఫెన్స్ లో పడిపోయిన టీమిండియా ముందుకు ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చింది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. ఎనిమిది దేశాలు తలపడే ఈ టోర్నీ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, షమీ, అర్ష్‌దీప్ సింగ్.. ఇదీ భారత జట్టు. యశస్వి జైస్వాల్ తప్పితే దాదాపు అందరూ సీనియర్లకే పెద్దపీట వేసింది బోర్డ్.
ఆసీస్ సిరిస్ లో రాణించిన నితిస్ కుమార్ రెడ్డికి టోర్నీలో అవకాశం దొరుకుందని చాలా మంది భావించారు. నిజానికి నితిస్ వన్డే, టీ ట్వంటీ రెండు ఫార్మెట్లు బాగా ఆడే ప్లేయర్. అనూహ్యంగా టెస్ట్ లో కూడా రాణించాడు. అలాంటి నితీష్ కి చోటు దక్కలేదు. అన్నట్టు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కూ ఇదే జట్టు కొనసాగుతుందని చెప్పింది బీసీసీఐ. ఫిబ్రవరి 6 నుంచి 12 మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది.