బి.సి.సి.ఐ. అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియాకు గురువారం రాత్రి గుండెపోటు వచ్చింది. తక్షణమే ఆయన కుటుంబ సభ్యులు కోల్ కతాలోని బి.ఎం.బిర్లా ఆసుపత్రికి తరలించారు. ఆయన కోసమే ప్రత్యేకంగా ఒక వైద్య బృందం ఏర్పాటు చేయబడింది. గత కొంత కాలంగా ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన గుండెకు రక్తం సరఫర చేసే నరాలలో ఒకటి బ్లాక్ అయినట్లు గుర్తించిన వైద్యులు దానిని సరి చేసేందుకు నిన్న రాత్రే ఆయనకు శాస్త్ర చికిత్స చేసినట్లు సమాచారం. దాల్మియా వెంట ఆయన కుమారుడు అభిషేక్ దాల్మియా ఉన్నారు. ఈ సమాచారం తెలియగానే భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలి పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి ఆరావ్ బిశ్వాస్ తదితరులు ఆసుపత్రికి వచ్చి అభిషేక్ దాల్మియాని పరామర్శించారు.