బి.సి.సి.ఐ. అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా(75) ఆదివారం రాత్రి కోల్ కతాలోని బి.ఎం.బిర్లా ఆసుపత్రిలో మరణించారు. శుక్రవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కానీ ఆయన కోలుకోలేకపోయారు. ఆయన గత కొంత కాలంగా తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా బి.సి.సి.ఐ. బాధ్యతలకు కూడా హాజరు కావడం లేదు.1979లో బి.సి.సి.ఐ.లో చేరిన జగ్మోహన్ దాల్మియా మూడుసార్లు బి.సి.సి.ఐ. అధ్యక్షుడుగా వ్యవహరించారు.