భారత్లో సెప్టెంబర్ వరకూ లాక్ డౌన్ ఎత్తేయడం సాధ్యం కాదని.. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంచనా వేసింది. అంటే… ఆర్థిక సంవత్సరంలో.. ఆరు నెలల పాటు.. దేశం మొత్తం లాక్డౌన్లోనే ఉంటుందని.. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయనంలో వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని చూస్తే… సడలింపులుకూడా సాధ్యం కావని.. జూన్ మధ్య కాలంలోనే… లాక్ డౌన్ సడలింపులు ప్రారంభిస్తారని.. సెప్టెంబర్ మధ్య కాలంలో లాక్ డౌన్ ఎత్తివేయడానికి అవకాశం ఉంటుందని బోస్టన్ గ్రూప్ అంచనా వేసింది. కోవిడ్ -19 కేసులు ఏ దశలోనూ తగ్గవని పెరుగుతూనే ఉంటాయని.. ఈ సంస్థ చెబుతోంది.
కన్సల్టింగ్ గ్రూప్ అయిన ఈ సంస్థ… అంచనాలు వేస్తూ ఉంటుంది. ఎవరైనా రిపోర్టులు అడిగితే రాసి ఇస్తూ ఉంటుంది. పరిశీలన చేస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే.. ఏపీ ప్రభుత్వం కూడా రూ. ఏడుకోట్లు పెట్టి.. ఈ సంస్థ సేవలను ఉపయోగించుకుంది. మూడు రాజధానులపై ఒప్పందం చేసుకున్న నెల రోజుల వ్యవధిలోనే.. అన్నింటినీ పరిశీలించి.. ఓ నివేదిక ఇచ్చేసింది. డబ్బులు పుచ్చుకుంది. అయితే ఇప్పుడు.. ఎవరూ అడగకుండానే..ఏ ప్రభుత్వమూ డబ్బులు ఇవ్వకుండానే. .. కోవిడ్ -19 ప్రభావంపై రిపోర్ట్ రెడీ చేసి.. కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చింది.
లాక్ డౌన్ నిబంధనలు.. ఆరు నెలల పాటు కొనసాగించడం అసాధ్యమని.. ఏ ప్రభుత్వ అధికారిని అడిగినా తేల్చేస్తారు. రాజకీయ నాయకుల్ని అడిగినా చెబుతారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నా… లాక్ డౌన్ నిబంధనలు సడలించక తప్పని పరిస్థితి ఉంది. అయితే.. ప్రస్తుతం.. దేశంలో బయటపడుతున్న కేసులు మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారివి.. వారి కాంటాక్ట్ కేసులే కావడంతో.. చాలా వరకూ కేసులు పెరుగుతున్నా.. కంట్రోల్లోకి వచ్చిందనే భావనలో ఉన్నారు. అయితే.. ఇప్పుడు.. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ చిత్రమైన వాదనతో రిపోర్ట్ విడుదల చేసింది.