ఇప్పుడు అంతా సోషల్ మీడియా మార్కెటింగ్. అవి ప్రకటనలా కాదా అని తెలుసుకునేలోపే అబ్బా.. అక్కడ పెబ్టుబడి పెడితే రెండేళ్లలో రెట్టింపు అవుతాయని ఆశ పెట్టేస్తారు. అంతగా ఆకర్షిస్తూంటాయి ప్రకటనలు. కానీ రియాలిటీ మాత్రం అందులో సగం కూడా ఉంటుందో ఉండదో చెప్పడం కష్టం
తాను సోషల్ మీడియాలో చూసి పొలం కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నానని తీరా చూస్తే.. అది లోపల ఎక్కడో ఉందని.. తనను మోసం చేశారని ఓ వ్యక్తి ఇటీవల పోలీసులను ఆశ్రయించాడు. అతను ధైర్యం చేసి ముందుకు వచ్చాడు. కానీ ఇక చేయగలిగేదేముందని అలాంటి స్థలాల్ని రిజిస్ట్రేషన్ చేయించుకుని సైలెంట్ గా ఉన్న వాళ్లకు లెక్కే ఉండదు. సోషల్ మీడియాలో వచ్చే వీడియోల్లో అత్యధిక ప్రమోషన్లే. రియల్ ఎస్టేట్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అపార్టుమెంట్లు, ఇళ్లు, స్థలాలు, పొలాలను చాలా తక్కువ ధరకే ఇస్తామని ఎన్నో సౌకర్యాలకు దగ్గరని ఉదరగొడుతూంటారు. కానీ తీరా చూస్తే అవి ఎక్కడో ఉంటాయి.
సోషల్ మీడియా ప్రకటనలు చూసి అసలు ఆ ఇళ్లను కొనాలన్న ఆలోచనకు రావడమో మోసపోవడానికి మెదటి మెట్టు.అయితే నమ్మశక్యంగా ఉందనుకుంటే.. వెళ్లి పరిశీలించడంలో తప్పు లేదు. కానీ ప్రతీ విషయాన్ని క్షుణ్యంగా తెలుసుకోవాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. తొందరపడిదే .. జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న సొమ్ముకు గ్యారంటీ లేకుండా పోతుంది.
మన దేశంలో సోషల్ మీడియా అంటేనే ఓ పెద్ద ఫేక్‌గా మారిపోయింది. నిజమైన ఆస్తులను అక్కడ అమ్మడానికి పెట్టడానికి చాలా మంది సిద్ధంగా లేరు. సోషల్ మీడియా యాడ్స్ విశ్వసనీయతకు ఇంకా స్టాండర్డ్ రాలేదు. అందుకే… వీలైనంత వరకూ సోషల్ మీడియా సోర్స్ పక్కన పెట్టి… ఇతర మార్గాల ద్వారా ప్రాపర్టీ ఎంక్వయిరీలు చేసుకోవడం బెటర్.