ఆమె అందంగా ఉంటుంది. కానీ అది శరీరం వరకే. బుర్ర మాత్రం క్రిమినల్ మైండ్‌సెట్‌తో చాలా అసహ్యంగా ఉంటుంది. అందుకే తన బాహ్య సౌందర్యాన్ని ఎరగా వేసి.. క్రిమినల్ బుర్రతో పది మందినీ దోచుకోవడం ప్రారంభించింది. ఈ దోపిడీ కూడా.. నాటుగా కాదు స్మార్ట్‌గా ఉంటుంది. చిన్న చిన్న వారిని టార్గెట్ చేయలేదు.. రాజకీయ నేతల్ని కూడా పట్టేసింది. పెద్ద ఎత్తున బ్లాక్ మెయిలింగ్ మోసాలకు పాల్పడింది. ఆమె చేతిలో మోసపోయిన వారు పరువు పోతుందని సైలెంట్ గా ఉన్నవారే ఎక్కువ. అతి కొద్ది మంది మాత్రం బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో.. ఆమె సంగతిని ఖాకీలు బయట పెట్టారు.
జగిత్యాల జిల్లాలో బాగా డబ్బున్న మగవారితో పరిచయాలు పెంచుకోవడం… శారీరకంగా దగ్గరవడం వంటి పనులతో..ఓ మహిళ వీఐపీ వర్గాల్లో కొంత కాలం పాటు హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఆమె తన వలలో పడినవారితో సరససల్లాపాలు కొనసాగిస్తూ.. రహస్యంగా వీడియో తీయించేవారు. ఆమె..తమ అందానికి…తమ పలుకుబడి దాసోహం అయి.. శారీరక సుఖం పొందడానికి వచ్చిందన్న భ్రమలో ఉండే మగవాళ్లు దీన్ని గుర్తించలేకపోయారు. తమ ఫోన్‌కి… తమ రాసలీలల క్లిప్ వచ్చిన తర్వాతే వారికి లైట్ వెలిగేది. అలా పెద్ద ఎత్తువ మగవాళ్లను ఆ కిలాడీ మోసం చేసింది.
తన మోసాల కోసం.. ఓ ముఠాను కూడా ఏర్పాటు చేసింది. స్పష్టంగా తన రాసలీలల దృశ్యాలను తీయడానికి ఇద్దరు కెమెరామెన్లను నియమించుకుంది. ఇలా… కొంత మంది రాజకీయ నేతలతో పాటు.. పలువురు వ్యాపార ప్రముఖుల్ని కూడా బెదిరించి లక్షల్లో వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ పాపం ఎప్పటికైనా పండాల్సిందేగా…చివరికి తమ పేరు బయటకు రాకుండా.. బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టి వారిని అరెస్ట్ చేశారు. ఎవరు ఫిర్యాదు చేశారు.. ఎవరు ఆ మాయలేడి వలలో పడ్డారన్నదానిపై స్పష్టత లేదు. కానీ ఎవరో వీఐపీ ఉండబట్టే..ఇలా చేశారని అనుకోవచ్చు.
మొత్తం 8 మందిని కిలాడీ లేడీ ..తన శరీరాన్ని ఎరగా వేసి మోసం చేసినట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూశర్మ ప్రకటించారు. మగవారు గుర్తు తెలియని మహిళలతో సన్నిహితంగా ఉండవద్దని ఆమె సలహా ఇస్తున్నారు. మోసపోయిన వారు ఇంకా ఎవరైనా ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఆమె పిలుపునిస్తున్నారు. బలహీనతల్ని కంట్రోల్ చేసుకోకపోతే.. మోసపోవడం మగవాళ్ల వంతవుతుంది.