హైదరాబాద్: బీఫ్(గొడ్డుమాంసం)పై నిషేధం, ఉత్తరప్రదేశ్లోని దాద్రిలో బీఫ్ తిన్నందుకు ఒక వ్యక్తిని చంపటం వంటి ఘటనలకు నిరసనగా ఉస్మానియా విద్యార్థులు యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించారు. నిన్న ఉస్మానియాలో సుమారు వందమంది విద్యార్థులు ఆర్ట్స్ కాలేజివద్ద చేరి బీఫ్ బిర్యాని తిని దాద్రి ఘటనపై తమ నిరసన వ్యక్తం చేశారు. బ్రాహ్మణవాద ఆహార అలవాట్లను ప్రజలపై రుద్దటం ఆమోదయాగ్యం కాదని అన్నారు. దేశంలో హిందువులతోసహా ఎన్నో మతాలవారు బీఫ్ తింటారని, ప్రభుత్వం వారిని చట్టాలతో ఆపటం సరికాదని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీలో త్వరలో పెద్ద బీఫ్ పెస్టివల్ నిర్వహిస్తామని ప్రకటించారు.