పాలకుడు సొంత రాష్ట్రంపై కుట్రలు చేసుకునేవాడు అయి ఉండకూడదు. సొంత ప్రజల్ని నాశనం చేసి తాను ఒక్కడినే సింహాసనంపై కూర్చుని అందర్నీ పీల్చి పిప్పి చేయాలనే వ్యక్తిత్వం ఉండకూడదు. అలా ఉంటే రాష్ట్రం, ప్రజలు అనే ఆలోచనే ఉండదు. పూర్తిగా వ్యక్తిగత స్వార్థంతో చెలరేగిపోతారు. ఏపీలో గత ఐదేళ్లుగా అదే జరిగింది. విడిపోయిన రాష్ట్రానికి అమరావతి పేరుతో ఓ రాజధానిని సంకల్పిస్తే తనకూ ఓకే అన్న ఆ నేత సీఎం పదవి చేపట్టాక మొదటి కంటా నరికేశాడు. ఎన్నికల్లో అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పి పవర్ చేరికి రాగానే చంద్రముఖిలా మారిపోయాడు. భూములు ఇచ్చిన రైతుల్ని చెరబట్టాడు.ఓ ఆద్భుతమైన పట్టణీకరణ మోడల్ ని ఇంత క్రరంగా ధ్వంసం చేస్తున్న జగన్ రెడ్డిని ప్రపంచం మొత్తం అసహ్యంగా చూసింది. వ్యాపార ప్రపంచం నివ్వెరపోయింది. ఏపీ వైపు ఎవరూ రాకుండా హెచ్చరికలా మారింది.
ఈ రాజదానిని నిర్వీర్యం చేయడానికి జగన్ రెడ్డిని పన్నని కుట్రలు, కుతంత్రాలు లేవు. అంత కసి రాజధాని మీద ఎందుకు ?. కేవలం కమ్మ సామాజికవర్గానికి మేలు జరుగుతుందన్న దుగ్ధతోనే అలా చేశారు. నిజానికి కమ్మ సామాజివర్గానికి మేలు జరుగుతుందని ఎవరూ చెప్పరు. భూములు ఇచ్చింది బడుగు బలహీనవర్గాలే. రాజధాని అభివృద్ధి చెందితే.. లాభపడేది రాష్ట్రమే. పది లక్షల కోట్ల సంపదను నాశనం చేశామని విజయసాయిరెడ్డి గర్వంగా రాజధానిని నిర్వీర్యం చేయడం గురించి చెప్పుకున్నారు. ఈ పది లక్షల కోట్లు ఎవరివి ?. అన్ని వర్గాల ప్రజలవి. ఇంత సంపదను ప్రజలు కోల్పోయారని వైసీపీ నేతలు చెప్పకనే చెప్పారు.
ఇప్పుడు వారేం చేశారు. ప్రపంచం లో ఏ దేశంలో లేని విధంగా దక్షిణాఫ్రికాలో మూడు రాజదానులు ఉన్నాయని రాష్ట్రాన్ని దక్షిణాఫ్రికా చేస్తానని ఫేక్ రిపోర్టులను తయారు చేయించి కుట్రలు పన్నారు. కానీ మనకు రాజ్యాంగం ఇంకా రక్షణగా ఉంటోంది. ఇప్పటి వరకూ ఆయన రాజధానిని మార్చలేకపోయారు. భవిష్యత్ లో కూడా మార్చలేరు. ఎందుకంటే రైతులకు రాజ్యంగం అండగా ఉంది. మార్చాలనుకుంటే రూ. లక్ష కోట్లను రైతులకు పరిహారంగా చెల్లించాలి. ఆ తర్వాత తన ఇష్టం వచ్చినట్లుగా మార్చుకోవాలి. కానీ అలా కట్టకుండా రైతుల్ని మోసం చేయాలని అనుకున్నారు. తన ఈ కుత్సిత రాజకీయంలో ఏపీ పరువు ప్రపంచం ముందు పోయింది. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. అధికారికంగా అమరావతి రాజధాని..కానీ ప్రభుత్వం మా రాజధాని అని చెప్పదు.
మేనిఫెస్టోలో మూడు రాజధానులు అని పెట్టారు. కానీ న్యాయపరంగా.. రాజ్యాంగపరంగా సాధ్యం కాదు. ఎలా సాధ్యమో చెప్పలేదు. వైజాగ్ లో ప్రమాణం చేస్తానని సొల్లు కబుర్లు చెప్పిప్రజల్ని మభ్ పెట్టేందుకు ప్రయత్నించారు. కానీ వైజాగ్ పేరుతో చేసిన అరాచకం చూసి ఉత్తరాంద్ర ప్రజలు హడలి పోయారు.ఈ దుర్మార్గమైన అచారక పరిపాలనకు ఒక్క ఓటు పడినా.. సమర్థించినట్లు అవుతుంది. కులమతాలు అన్నీ.. భావోద్వేగానికి సంబంధించినవి. కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందినే తరాలు బాగుంటాయి. అలా ఉండాంటే ఓటేసే ముందు ఓ సారి ఆలోచించాలి. మనకు రాజధాని లేకుండా చేసిన వాడ్ని తరిమికొట్టాలి.