ఊరంటే ఉపాధి అవకాశాల గని కావాలి. మనం ఊళ్లో బతకాలంటే పనులు ఉండాలి. ఆ పనులు స్థాయిని బట్టి రియల్ ఎస్టేట్ పనుల దగ్గర నుంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగాల వరకు ఏదైనా కావొచ్చు. అందరికీ పని చేసుకోవడానికి ఉద్యోగాలు దొరుకుతున్నాయా… వ్యాపారాలు సక్రమంగా సాగుతున్నాయా అన్నదే ముఖ్యం. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో మనీ సర్క్యూలేషన్ ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. అంతే కానీ రేషన్ బియ్యం పడేస్తాను.. తిని పడుకోండి.. ఓట్లు అవసరం అయినప్పుడు వచ్చి వేయండి అనే పాలకులు ఉంటే… పేదలు మరింత నిరుపేదలవుతారు.. నిరుపేదలు ..ఆకలి చావులు చస్తారు.
ఏపీలో గత ఐదేళ్లుగా ఏం జరిగిందో కాళ్ల ముందే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన అద్భుతమైన అవకాశాల్ని ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ఒడిసి పట్టుకుని పారిశ్రామికీకరణ దిశగా ముందడుగు వేస్తూంటే… యువకుడు అని నమ్మి ప్రజలు చేతికి బ్యాటన్ ఇస్తే.. జగన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. ఒక్క పరిశ్రమను తెచ్చింది లేకపోగా .. గతంలో వస్తామని ఒప్పందాలు చేసుకున్న పరిశ్రమలన్నింటినీ తరిమేశారు. కొన్ని లక్షల మంది యువత ఉద్యోగావకాశాల్ని కోల్పోయింది. రాష్ట్రం పన్నుల రూపంలో కొన్ని వేల కోట్లు కోల్పోయింది. ఐదేళ్లలో ప్రభుత్వ నిర్వాకా కారణంగా ఉద్యోగం దక్కించుకోలేకపోయిన వాళ్లలో మీ బిడ్డ కూడా ఉంటాడు. మీ బంధువుల బిడ్డ ఉంటాడు… ఇవాళ కాకపోతే రేపైనా పరిస్థితి మారాలంటే… మీ బిడ్డకు ఓ మంచి ఉద్యోగం రావాలంటే.. కష్టపడి పని చేసుకుని జీవితంలో పైకి ఎదగాలంటే.. కావాల్సింది అభివృద్ధి.. పెట్టుబడులు తీసుకు రావడం.
వాలంటీర్ల పేరుతో రెండున్నర లక్షల మంది జీవితాల్ని .. సచివాలయ ఉద్యోగాల పేరుతో మరో లక్షన్నర మంది జీవితాల్ని జగన్ రెడ్డి ఐదేళ్లలో నిర్వీర్యం చేశారు. ఆ వాంటీర్లు ఇంకేం చేయగలరు ?., తమ యువ జీవితంలో ఐదేళ్ల అమూల్యమైన సమయం పోగొట్టుకున్నారు. ఒక వ్యక్తి రాజకీయ స్వార్థానికి ఆ జీవితాలన్నీ జీవితంలో వెనక్కి తెచ్చుకోలేనంతగా ఐదేళ్ల సమయాన్ని కోల్పోయాయి. దానికి ఎవరు బాధ్యులు ?. ఖచ్చితంగా రాజకీయ స్వార్థం కోసం పని చేసే పాలకుడే.
చేసిన విధ్వంసం చేసి.. పిట్టకథలు చెబుతూ.. జన హయాంలో లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చానని పాంప్లెట్లు వేసుకుని వచ్చే వాళ్లు వస్తూనే ఉన్నారు. పులివెందులలో పది కంపెనీలకు భూమిలిచ్చి శంకుస్థాపన చేస్తే ఒక్క కంపెనీ కూడా పనులు ప్రారంభించలేదు. ఆ భూములు తాకట్టు పెట్టేసుకుని ఉంటారు. ఇలాంటి లెక్కేలేనన్ని మాయలు చేసే పాలకుడు కావాలో… భవిష్యత్ ను మార్చే పాలకులు కావాలో.. ఓట్లేసేవారే విజ్ఞతతో ఆలోచించుకోవాలి. కులం, మతం, ప్రాతం కూడు పెట్టవు. కులపోడు వచ్చి ఇంట్లో వాళ్లను చెరబట్టినా మన కులోపోడే అని లైట్ తీసుకోలేరు. ప్రతి ఒక్కరికి ప్రశాంతమైన జీవితం.. ఉద్యోగావకాశాలు ఉండాలి. ఓటేసే ముందు ఆలోచించండి .. !